మూడు రాజధానుల మూర్ఖత్వాన్ని వీడాలి

ABN , First Publish Date - 2020-08-08T09:53:02+05:30 IST

దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే మూర్ఖత్వపు విధానాన్ని ..

మూడు రాజధానుల మూర్ఖత్వాన్ని వీడాలి

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌


నంద్యాల, ఆగస్టు 7: దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే  మూర్ఖత్వపు విధానాన్ని సీఎం వీడాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఎవరి మాటా వినకుండా, ప్రజా అభిప్రాయాన్ని తీసుకోకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే ప్రపంచంలో 8వ వింత కావడం ఖాయమని అన్నారు.  వైఎస్‌ జగన్‌ తుగ్లక్‌ పాలన భవిష్యత్‌ తరాలకు మాయని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. మూడు రాజధానులకు స్వాగతం పలుకుతూ రాయలసీమ జిల్లాల్లోని అధికార పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.


కర్నూలులో పేరుకు మాత్రమే హైకోర్టు ఏర్పాటు ప్రకటన చేశారే తప్ప రాష్ట్రంలో మరెక్కడా హైకోర్టు బెంచి ఏర్పాటు చేయబోమని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేయకపోవడం వెనుక ఆంతర్యాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన  ప్రభుత్వాలు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని అన్నారు. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ ప్రాంతం సమగ్రంగా ఎలా అభివృద్ధి చెందుతుందో వైసీపీ పాలకులు స్పష్టం చేయాలని ఫరూక్‌ డిమాండ్‌ చేశారు. ప్రపంచమంతా కరోనాతో అవస్థలు పడుతుంటే, ఏపీలో మాత్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్నా ప్రజా వ్యతిరేక విధానాలు దారుణంగా ఉన్నాయని అన్నారు. కొవిడ్‌ బాధితులకు చికిత్సను అందించడంలో, ఐసొలేషన్‌ కేంద్రాలలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శించారు. హోం ఐసొలేషన్‌లో ఉం టున్న కొవిడ్‌ బాధితులను పట్టించుకునే వారే కరువయ్యారని, కొవిడ్‌ బాధితులకు కిట్లను కూడా అందించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఫరూక్‌ ధ్వజమెత్తారు. ప్రజ లకు తగిన వైద్యం అందించాల న్నారు.  వైసీపీ ప్రభుత్వం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలని ఫరూక్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-08T09:53:02+05:30 IST