విస్తరణ బాటలో ఎన్‌ఎండీసీ

ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST

ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా విస్తరిస్తోంది. మరో పదేళ్లలో వార్షిక ఇనుప ఖనిజం ఉత్పత్తి సామర్ధ్యాన్ని

విస్తరణ బాటలో ఎన్‌ఎండీసీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎన్‌ఎండీసీ తన ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా విస్తరిస్తోంది. మరో పదేళ్లలో వార్షిక ఇనుప ఖనిజం ఉత్పత్తి సామర్ధ్యాన్ని 10 కోట్ల టన్నులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ డైరెక్టర్‌ (ఉత్పత్తి విభాగం) పీకే శత్పతి వెల్లడించారు. ప్రస్తుత ఉత్పత్త సామర్ధ్యంలో 97 శాతం ఉపయోగించుకోవడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం 3.5 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధిస్తామన్నారు. 2023 నాటికి 5 కోట్ల టన్నులు, 2030 నాటికి 10 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-01-18T05:30:00+05:30 IST