అక్టోబర్ 10న ఎన్ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్

ABN , First Publish Date - 2021-08-25T01:54:51+05:30 IST

క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్గించడానికి అక్టోబర్ 10న "ఎన్ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్"

అక్టోబర్ 10న ఎన్ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్

హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్గించడానికి అక్టోబర్ 10న "ఎన్ఎమ్‌డీసీ గ్రేస్ క్యాన్సర్ రన్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. " బీట్ క్యాన్సర్ బియాండ్ కోవిడ్" అనే థీమ్‌తో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో దీనిని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్యాన్సర్ పై పోరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇది నాల్గవ ఎడిషన్ అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమ వివరాలను మంత్రి కిషన్ రెడ్డి  ప్రకటించారు. ఈ క్యాన్సర్ రన్‌ను ఎన్ఎమ్‌డీసీ స్పాన్సర్ చేస్తోందని, రియాన్, అపోలో ఆసుపత్రులు మద్దతునిస్తున్నాయని ఆయన తెలిపారు.


ఈ రన్‌ను హైబ్రిబ్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్నారు. వర్చువల్, భౌతికంగా పాల్గొనే అవకాశం ఉంది. " ఏ రోగి కూడా ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు దూరం కాకూడదు " అనే సంకల్సంతో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ రన్ ద్వారా ధైర్యాన్ని, త్యాగాన్ని నింపే "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్"తో స్ఫూర్తి కలిగి బలం, చురుకుదనం  పెరుగుతాయన్నారు. కరోనా మహమ్మారి సమయంలో క్యాన్సర్‌ను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ రన్‌ను మూడు విభాగాలుగా నిర్వహిస్తారని ఆయన ప్రకటించారు. ఈ రన్‌లో పాల్గొనే వారికి "ఇ-బిబ్" లను అందిస్తారని ఆయన తెలిపారు. రన్‌లో పాల్గొన్న వారు తమ సెల్ఫీలను, ఫోటోగ్రాఫ్‌లను నిర్వాహకులకు పంపించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9959154371,  9985310069 నంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో అజయ్ మిశ్రా, సుజాతా రావు, నిరంజన్ రాజ్, చిన్నబాబు సుంకవల్లి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T01:54:51+05:30 IST