బిల్లులు ఇవ్వరు..భవనాలు ఎలా కట్టాలి..?

ABN , First Publish Date - 2021-07-30T05:55:49+05:30 IST

‘సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్‌ సెంటర్లు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనుల బిల్లులు ఇవ్వరు. మరో పక్క ఇసుక కొరత. కాని సకాలంలో వాటిని నిర్మించాలని మాపై ఒత్తిడి తేవడం ఏమిటి..?’ అని పీఆర్‌ డీఈ మల్లికార్జునను సర్పంచులు, కాంట్రాక్టర్లు ప్రశ్నించారు

బిల్లులు ఇవ్వరు..భవనాలు ఎలా కట్టాలి..?
డీఈతో మాట్లాడుతున్న సర్పంచులు


పీఆర్‌ డీఈని ప్రశ్నించిన కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు

గుడిబండ, జూలై 29: ‘సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్‌ సెంటర్లు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనుల బిల్లులు ఇవ్వరు. మరో పక్క ఇసుక కొరత. కాని సకాలంలో వాటిని నిర్మించాలని మాపై ఒత్తిడి తేవడం ఏమిటి..?’ అని పీఆర్‌ డీఈ మల్లికార్జునను సర్పంచులు, కాంట్రాక్టర్లు ప్రశ్నించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం మండల స్థాయి  అధికారులు, సర్పంచులతో పీఆర్‌డీఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ... మండలానికి మంజూరైన భవనాలను త్వరగా పూర్తి చేయాలని సర్పంచులు, కాంట్రాక్టర్లకు సూచించారు. దీనిపై సర్పంచులు, కాంట్రాక్టర్లు మాట్లాడుతూ.. బిల్లులు, సి మెంటు, ఇసుక కొరత వల్ల భవనాలను ఎలా నిర్మించాలని డీఈని ప్రశ్నించారు. ఇనుము, కూలీల ధరలు విపరీతంగా పెరగడంతో పనులు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయా రు. ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలిస్తే ట్రాక్టర్లను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారని, దీంతో ఆ పనులను ఎలా చేపట్టాలని డీఈ నిలదీశారు. కొంత మం ది సర్పంచ్‌లు తాము పనులు చేయమని కరాఖండిగా తేల్చిచెప్పేశారు. ఇసుకకు అ నుమతి..  సకాలంలో బిల్లులు అందిస్తే భవనాలను నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరేంద్రకుమార్‌, తహసీల్దార్‌ మహబూబ్‌పీరా, ఏఓ తిమ్మప్ప, నాయకులు భూతరాజు, శివకుమార్‌, చం ద్రశేఖర్‌, సర్పంచులు కరుణాకర్‌గౌడ్‌, అశ్వర్థ్‌, రంగస్వామి, తిప్పేస్వామి, లక్ష్మీనారాయణ, కవిత, ఓబన్న, గౌరమ్మ, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T05:55:49+05:30 IST