‘టీకా సేకరణ’ మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది: ప్రైవేటు ఆస్పత్రులు

ABN , First Publish Date - 2021-06-14T01:47:32+05:30 IST

టీకా సేకరణకు సంబంధించి కేంద్రం ప్రకటించిన కొత్త విధివిధానాల్లో స్పష్టత లోపించిందని అనేక ప్రైవేటు ఆస్సత్రులు చెబుతున్నాయి.

‘టీకా సేకరణ’ మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది: ప్రైవేటు ఆస్పత్రులు

న్యూఢిల్లీ:  టీకా సేకరణకు సంబంధించి కేంద్రం ప్రకటించిన కొత్త విధివిధానాల్లో స్పష్టత లోపించిందని అనేక ప్రైవేటు ఆస్సత్రులు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం టీకా సేకరణ ఎలా చేపట్టాలనే దానిపై స్పష్టత లేక తాము వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ఈ విషయంలో టీకా తయారీ సంస్థలను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాయి. నిబంధనలను మరింత విశదీకరించడంతో పాటూ టీకా సేకరణ కో్సం ప్రభుత్వం సింగిల్ విండో వ్యవస్థను ఏర్పాటు చేయాలని అవి కోరాయి. కాగా.. టీకా పంపిణీకి సంబంధించి టీకా తయారీ సంస్థకు, కేంద్రానికి మధ్య జిరిగిన ఉతర్తప్రత్యుత్తరాలను జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. ‘‘మీరు చెప్పేంత వరకూ ప్రైవేటు ఆస్పత్రులకు టీకాలు ఇవ్వబోము’’ అని ఆ టీకా సంస్థకు చెందిన కీలక అధికారి ఒకరు కేంద్రానికి లేఖ రాసినట్టు వార్తలు వెలువడ్డాయి. 


ప్రభుత్వ విధానం కారణంగా టీకాకరణ ఆలస్యమవుతోందని బాత్రా ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.  ‘‘టీకా పంపిణీ విధివిధానాల్లో స్పష్ట లోపించింది. టీకాల కోసం జూన్ 21 వరకూ వేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ప్రభుత్వం కూడా వేచి చూడాలనే సూచించింది. టీకా సేకరణ విధివిధానాలపై మాకూ స్పష్టత లేదని ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి’’ అని మెడికల్ డైరెక్టర్ ఎస్‌సీఎల్ గుప్తా వాపోయారు. ఈ పరిస్థితి కారణంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-14T01:47:32+05:30 IST