ప్రకటనల్లో శరీర రంగు పరంగా వివక్ష తగదు

ABN , First Publish Date - 2020-09-21T08:17:19+05:30 IST

వ్యాపార ప్రకటనలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. శరీర రంగు పరంగా ఏ రకమైన వివక్షను చూపేలా వ్యాపార ప్రకటనలు ఉండరాదని స్పష్టం చేసింది. ఉత్పత్తుల వర్ణన, మోడల్స్‌ హావభావాల పరంగా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది...

ప్రకటనల్లో శరీర రంగు పరంగా వివక్ష తగదు

  • ఉత్పత్తుల వర్ణన విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
  • పారామిలటరీలో 32,238 మందికి కరోనా పాజిటివ్‌: కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వ్యాపార ప్రకటనలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. శరీర రంగు పరంగా ఏ రకమైన వివక్షను చూపేలా వ్యాపార ప్రకటనలు ఉండరాదని స్పష్టం చేసింది. ఉత్పత్తుల వర్ణన, మోడల్స్‌ హావభావాల పరంగా జాగ్రత్తగా ఉండాలని  పేర్కొంది.


ఫెయిర్‌నెస్‌, వైట్‌నెస్‌ క్రీమ్‌లను ప్రమోట్‌ చేసే వ్యాపార ప్రకటనలను నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా అంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని చౌబే సమాధానమిచ్చారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండే వ్యాపార ప్రకటనలకు సంబంధించిన  అంశాలను స్వతంత్ర ప్రతిపత్తిగల భారత వ్యాపార ప్రకటనల ప్రమాణాల సంస్థ (ఏఎ్‌ససీఐ) చూసుకుంటుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటివరకు 16.79 లక్షల మందికి నివాస ధ్రువపత్రాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్‌సభలో హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌ రెడ్డి వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రజల కదలికల మీద ఎలాంటి నియంత్రణలూ లేవని స్పష్టం చేశారు.  పారామిలటరీ సిబ్బందిలో 32,238 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు లోక్‌సభలో మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ వెల్లడించారు. పారామిలటరీలో అత్యధిక మరణాల రేటు సీఐఎ్‌సఎఫ్‌ (0.43శాతం) నమోదైందని చెప్పారు. కరోనా నేపథ్యంలో స్థానికంగా లాక్‌డౌన్‌ విధించడానికి కొన్ని రాష్ట్రాలు అనుమతి కోరాయని, దీనిని కేంద్రం అంగీకరించలేదని మంత్రి చెప్పారు. లిక్విడిటీ ప్యాకేజీ కింద డిస్కంలకు రూ. 70,590 కోట్ల రుణాలను కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవగౌడ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. 1996 తర్వాత రాజ్యసభలో జేడీఎస్‌ తరపున ఓ సభ్యుడు ఎన్నిక కావడం ఇదేతొలిసారి. దేశంలో యూరియా ఎగుమతులు 22శాతం పెరిగాయని, గత ఆర్థిక సంవత్సరంలో 91.23 లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నామని లోక్‌సభకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. 


Updated Date - 2020-09-21T08:17:19+05:30 IST