Abn logo
Sep 19 2021 @ 14:51PM

కొత్త సీఎం ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

న్యూఢిల్లీ: కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా అనంతరం పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకాభిప్రాయాన్ని రాబట్టలేకపోవడంతో ఆదివారం జరగాల్సిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం వాయిదా పడింది. అభిప్రాయ సేకరణ కోసం ఎమ్మెల్యేలను పార్టీ పరిశీలకులు పిలిపిస్తున్నారు. ఎమ్మెల్యేలను పిలిపించే ప్రక్రియ ప్రారంభమైందని, ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలని పార్టీ నేత ఒకరు తెలిపారు. పీపీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ పేరు శనివారం సాయంత్రం దాదాపు ఒక కొలిక్కి వచ్చిందనుకున్న దశలో పార్టీ అధిష్టానం పునరాలోచన చేసింది. సునీల్ జాఖడ్‌‌కు సీఎం పగ్గాలు అప్పగించాలనే ఆలోచనను కేబినెట్ మంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రాండ్వా వ్యతిరేకించారు. హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోనీకి అవకాశాలు ఉండవచ్చని అన్నారు. అయితే, ఆ తర్వాత ఆయన శాంతించారు.

ఇవి కూడా చదవండిImage Caption