పంటనష్టం జాబితాలేవీ?

ABN , First Publish Date - 2021-12-05T06:40:37+05:30 IST

జిల్లాలో తుఫాన ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల జాబితా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల్లో ఎక్కడా కనిపించడం లే దు.

పంటనష్టం జాబితాలేవీ?
పుట్లూరు మండలం కడవకల్లు రైతు భరోసా కేంద్రం వద్ద కనిపించని పంటనష్టం జాబితా

1,11,786 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు అంచనా 

ఆర్బీకేల్లో ప్రదర్శించాలని 

ఉన్నతాధికారుల ఆదేశం

తొలిరోజు ఎక్కడా కనిపించని వైనం 

అనంతపురం వ్యవసాయం, డిసెంబరు 4: జిల్లాలో తుఫాన ప్రభావంతో పంట నష్టపోయిన రైతుల జాబితా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల్లో ఎక్కడా కనిపించడం లే దు. శనివారం నుంచి పంటనష్టం వివరాలు రైతుల వారీగా ప్రదర్శించా లని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రైతు భరోసా కేంద్రాల్లో పంట నష్టం జాబితాలు ప్రదర్శించలేదు. ఆరు రోజులపాటు రైతు లు జాబితాను ప్రదర్శించాలని, ఎక్కడైనా పంటనష్ట పో యిన జాబితాలో పేర్లు లేని రైతులు వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి, జాబితాలో ఎక్కించేలా చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు సూచించారు. జిల్లావ్యాప్తంగా 859 రైతు భరోసా కేంద్రాలున్నాయి. తొలిరోజు ఎక్కడా పంటనష్టం జాబితాను ప్రదర్శించలేదు. వ్యవసాయ ఉన్నతాధికారులు ఆర్బీకేల్లో జాబితాను చూసుకోవాలని ప్రకటించడంతో పలు ప్రాంతాల్లోని ఆర్బీకేలకు రైతులు వెళ్లారు. అక్కడ జాబితాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. 


1,11,786 హెక్టార్లలో పంటనష్టం అంచనా

జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలకు 1,11,786 హెక్టార్లలో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచ నా  వేసింది. రబీ సీజనలో 81915 హెక్టార్లలో సాగుచేసిన పప్పుశనగ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. వరి   10710, పత్తి 13519, ఆముదం 2919, ఇతర పంటలు 2723 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు గుర్తించారు. అన్నిరకాల పంటలకు సంబంధించి రూ.495కోట్ల విలువైన 1,23,774 మెట్రిక్‌టన్ను ల దిగుబడిని నష్టపోయినట్లు నిర్ధారించారు.

Updated Date - 2021-12-05T06:40:37+05:30 IST