ఆందోళనలో మరణించిన రైతుల డేటా లేదు: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-02T02:24:01+05:30 IST

రైతుల మరణాలపై డేటా లేదని కేంద్ర ప్రభుత్వం ఇలా చెప్పడం ఇది రెండవసారి. జూలై-ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో కూడా రైతుల మరణాలపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం తెలిపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ సుమారు 800.

ఆందోళనలో మరణించిన రైతుల డేటా లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్రం మరోసారి ఆశ్చర్యకరమైన వార్త చెప్పింది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ వందలాది రైతులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ మరణాలకు సంబంధించిన డేటా తమ దగ్గర లేదని కేంద్రం ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, బుధవారం పార్లమెంట్‌లో ఆరు ప్రశ్నలకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా డేటా తమ దగ్గర లేనందువల్ల రైతులకు పరిహారం ఇవ్వలేమని ఆయన తేల్చి చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.


రైతుల మరణాలపై డేటా లేదని కేంద్ర ప్రభుత్వం ఇలా చెప్పడం ఇది రెండవసారి. జూలై-ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో కూడా రైతుల మరణాలపై తమ వద్ద డేటా లేదని ప్రభుత్వం తెలిపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ సుమారు 800 మంది రైతులు మరణించారని బీజేపీయేతర పార్టీలు సహా అనేక మంది చెబుతున్నారు. వీరికి పరిహారం కూడా పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం వీరికి పరిహారం ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు. ఆయా రాష్ట్రాలకు లభించిన డేటా కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లభించలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Updated Date - 2021-12-02T02:24:01+05:30 IST