ధర లేక... రోడ్డు పక్కన అలా!

ABN , First Publish Date - 2021-05-23T05:44:45+05:30 IST

టమోటాకు డిమాండు లేకపోవడం రైతులకు మరోసారి శరాఘాతంగా మారింది. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో జాతీయ రహదారి పక్కన పడేశారు

ధర లేక... రోడ్డు పక్కన అలా!
నీరుగట్టువారిపల్లెకు వెళ్లే రోడ్డు పక్కన పడేసిన టమోటాలు

మదనపల్లె అర్బన్‌, మే 22: టమోటాకు డిమాండు లేకపోవడం రైతులకు  మరోసారి శరాఘాతంగా మారింది. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కోత, రవాణా కూలీ కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎలాగోలా మదనపల్లె మార్కుట్‌కు తీసుకువచ్చినా ఇక్కడ మండీ వ్యాపారులు కొనుగోలు చేయక పోవడంతో పట్టణ సమీపంలోని నీరుగట్టువారిపల్లెకు వెళ్లే రోడ్డు పక్కన, చంద్రాకాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన పడేశారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వానకు టమోటాలు కుళ్లి దుర్వాసన వస్తోంది. మార్కెట్‌ అధికారులు చర్యలు తీసుకుని టమోటాలు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.  

Updated Date - 2021-05-23T05:44:45+05:30 IST