పాకిస్తాన్ సైన్యంతో మిఠాయిలు పంచుకునేందుకు భారత్ నిరాకరణ

ABN , First Publish Date - 2020-05-26T01:17:49+05:30 IST

ప్రతియేటా రంజాన్ సందర్భంగా పాకిస్తాన్‌- భారత్ సరిహద్దు వద్ద పాక్ సైనికులతో సంప్రదాయంగా మిఠాయిలు..

పాకిస్తాన్ సైన్యంతో మిఠాయిలు పంచుకునేందుకు భారత్ నిరాకరణ

న్యూఢిల్లీ: రంజాన్ సందర్భంగా పాకిస్తాన్‌- భారత్ సరిహద్దుల్లో సంప్రదాయంగా ఇరు సైన్యాలు మిఠాయిలు ఇచ్చిపుచ్చునే కార్యక్రమానికి బీఎస్ఎఫ్ సిబ్బంది ఈసారి దూరం జరిగారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇటీవల పాకిస్తాన్ వైపు నుంచి పెద్ద ఎత్తున తీవ్రవాదులను సరిహద్దులు దాటిస్తున్న నేపథ్యంలో దాయాదిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కశ్మీర్ మొదలు గుజరాత్ వరకు పశ్చిమాన పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎక్కడా మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోలేదు. మరోవైపు తూర్పున బంగ్లాదేశ్ సరిహద్దు పొడవునా బంగ్లాదేశ్ సరిహద్దు దళం (బీజీబీ)తో భారత సైన్యం మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం విశేషం.

Updated Date - 2020-05-26T01:17:49+05:30 IST