కరోనా రోగులకు ఈఎన్‌టీ సర్జరీలు వద్దు

ABN , First Publish Date - 2020-06-04T08:37:19+05:30 IST

కరోనా రోగులకు ఈఎన్‌టీ (కన్ను, ముక్కు, గొంతు) సర్జరీలు చేయవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. అత్యవసరంగా సర్జరీ చేయాల్సివస్తే.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆపరేషన్‌ థియేటర్లలో మాత్రమే చేయాలని...

కరోనా రోగులకు ఈఎన్‌టీ సర్జరీలు వద్దు

  • కేంద్ర ఆరోగ్యశాఖ సూచన


న్యూఢిల్లీ, జూన్‌ 3: కరోనా రోగులకు ఈఎన్‌టీ (కన్ను, ముక్కు, గొంతు) సర్జరీలు చేయవద్దని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. అత్యవసరంగా సర్జరీ చేయాల్సివస్తే.. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆపరేషన్‌ థియేటర్లలో మాత్రమే చేయాలని సూచించింది. ఇలాంటి ఆపరేషన్‌లలో వైద్యులకి, సిబ్బందికి కరోనా సోకే ముప్పు అధికంగా ఉంటుందని, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు 14 రోజుల తర్వాతే సర్జరీకి వెళ్లాలని చెప్పింది. ఈ మేరకు బుధవారం ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. ఆస్పత్రులకు వెళ్లే ఈఎన్‌టీ పేషెంట్లు తప్పనిసరిగా థర్మల్‌స్ర్కీనింగ్‌ చేయించుకోవాలని సూచించింది. అన్నింటికన్నా టెలీ మెడిసిన్‌ పద్ధతిని పాటించడం మరీ ఉత్తమమని తెలిపింది. దీని వల్ల రోగులతో పాటు వైద్యులకు, సిబ్బందికి కూడా మేలు జరుగుతుందని పేర్కొంది.


Updated Date - 2020-06-04T08:37:19+05:30 IST