Abn logo
Jul 26 2021 @ 18:39PM

స్విస్ బ్యాంక్‌కు బ్లాక్ మనీ ఎంత వెళ్లిందో తెలియదు: కేంద్రం

న్యూఢిల్లీ: స్వీస్ బ్యాంకులో భారతీయులు అక్రమంగా దాచిన సొమ్ము ఎంతుందో లెక్కలు తెలియవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభకు కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి రాసిన లేఖలో ‘‘ఈ పదేళ్లలో స్విస్ బ్యాంకులో ఎంత నల్లధనం పోగైందో సరిగ్గా తెలియదు’’ అని సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తీసుకురావడానికి ప్రభుత్వం విడతల వారీగా కొన్ని చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.


కాగా కొద్ది రోజుల క్రితం కేంద్ర నిర్మలా సీతారామన్ కూడా ఇదే సమాధానం చెప్పారు. స్విస్ బ్యాంకుల్లో 20,700 కోట్ల రూపాలయకు పైగా సొమ్మును భారతీయులు దాచిపెట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి నిర్మలా కొట్టి పారేశారు. ఆ డబ్బు ఎన్ఆర్ఐలది కాదని, అది ఇతర దేశాలకు చెందిన వ్యక్తులదని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా 2019 నుంచి ఖాతాదారుల డిపాజిట్లు తగ్గిపోయాయని వెల్లడించారు. అయితే, వీరంతా బాండ్లు, సెక్యూరిటీస్, ఇతర ఫైనాన్షియల్ విధానంలో జమ చేస్తూ వస్తున్నారు.


గతంతో పోలిస్తే తాజాగా స్విస్ బ్యాంకులో భారతీయుల డబ్బు పెరిగిందని తాజాగా వార్తలు గుప్పుమన్నాయి. 2019 వరకు స్విస్ బ్యాంకులో నల్లడబ్బు 6,625 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నట్లు వెల్లడి కాగా.. ఒక్క 2020 ఏడాదిలోనే 20,700 కోట్ల రూపాయలకు పైగా భారతీయుల సొమ్ము స్విస్ బ్యాంకులో జమ అయినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి.