Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 30 2021 @ 02:17AM

భయం వద్దు.. జాగ్రత్త మేలు!

ఒమైక్రాన్‌.. డెల్టా అంత డేంజర్‌ కాదు

స్వల్పలక్షణాలే.. ప్రాణాంతకం కాదు.. స్పష్టం చేస్తున్న దక్షిణాఫ్రికా వైద్యులు

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే సరిపోతుంది.. ఆందోళన వద్దని కొందరు వైద్యుల స్పష్టీకరణ

(సెంట్రల్‌డెస్క్‌)


‘‘నా క్లినిక్‌కు నవంబరు 18న వచ్చిన పేషెంట్లలో ఒకరు.. రెండు రోజులుగా విపరీతమైన అలసటతో, ఒంటి నొప్పులు, తలనొప్పితో బాధపడుతున్నట్టు చెప్పారు. అయితే, ఆ లక్షణాలు సాధారణ వైరల్‌ ఇన్ఫెక్షన్లలో కనిపించే తరహావే. అదే రోజు మరో ఆరుగురు పేషెంట్లు అవే లక్షణాలతో నా దగ్గరకు వచ్చారు. దీంతో ఏదో తేడాగా ఉందని భావించి జీన్‌ సీక్వెన్సింగ్‌ చేయించాలని నిర్ణయించాం. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ)’ను అప్రమత్తంచేశాం. ఆ మర్నాటి నుంచి రోజుకు కనీసం ఇద్దరు, ముగ్గురు పేషెంట్లు ఇవే లక్షణాలున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ (దక్షిణాఫ్రికాలో)లో నేను చాలా మంది డెల్టా పేషెంట్లను చూశాను.


కానీ, వారిలో కనిపించిన లక్షణాలు భిన్నమైనవి. నా వద్దకు వచ్చిన పేషెంట్లలో కనిపించిన లక్షణాలు డెల్టా పేషెంట్లతో పోలిస్తే చాలా స్వల్పంగా ఉన్నాయి. వారిలో ఎవరూ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం రాలేదు. ఆక్సిజన్‌ అవసరం రాలేదు. ఎవరూ రుచి, వాసన శక్తిని కోల్పోలేదు. వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స చేశాం. కొందరికి స్వల్పంగా దగ్గు వచ్చింది. అందరిలోనూ కనిపించిన లక్షణాలు.. ఒకటి రెండు రోజులపాటు విపరీతమైన అలసట. దాంతోపాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు.. అంతే.’’ ..నాలుగైదు రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమైక్రాన్‌ వేరియంట్‌ గురించి సౌతాఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ చైర్‌ డాక్టర్‌ ఏంజెలిక్‌ కొయెట్జీ మాటలివి. ఆమె చెబుతున్నదాని ప్రకారమే కాదు.. దక్షిణాఫ్రికాలో నమోదవుతున్న కొవిడ్‌ మరణాల గణాంకాల ప్రకారం చూసినా ఇదేమంత భయంకరమైన వేరియంట్‌ కాదని.. డెల్టా తరహాలో భారీగా ప్రాణనష్టం కలిగించేంత ప్రమాదకరమైనదీ కాదని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ‘సౌతాఫ్రికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పింది.


ఈ వేరియంట్‌ గురించి అనవసరంగా భయపెట్టే ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది. ఒమైక్రాన్‌ వేరియంట్‌లో మొత్తం 32 జన్యు ఉత్పరివర్తనాలు సంభవించాయి. అందుకే దీన్ని ఆందోళకర వేరియంట్‌గా ప్రకటించారనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటికే దీని బారిన పడిన పేషెంట్లు ఎంత మంది ఆస్పత్రిపాలయ్యారు? ఎంతమందికి ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయి ప్రాణవాయువు అందించాల్సి వచ్చింది? ఎంతమంది మరణించారు అనే ప్రశ్నలకు వస్తున్న సమాధానాలు అంత ఆందోళన కలిగించే స్థాయిలో లేవనేది వాస్తవం. ఒమైక్రాన్‌ వల్ల దక్షిణాఫ్రికాలో కొద్దిరోజులుగా కేసులు పెరిగిన మాట నిజమే. కొత్తగా వస్తున్న కేసుల్లో 90ు దాకా ఒమైక్రాన్‌ కేసులే ఉంటున్నట్టు సమాచారం. కానీ, ఆ స్థాయిలో ప్రాణనష్టంగానీ, ఆస్పత్రులు నిండిపోవడంగానీ జరగట్లేదు.

అదే నిజమైతే వరమే..

దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య ఈ ఏడాది జూలై 8న అత్యధికంగా 22,910గా నమోదైంది. నవంబరు 14న సున్నా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ నవంబరు 28 నాటికి కేసుల సంఖ్య 2,858కి చేరింది. కానీ, మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదవుతున్నాయి. నవంబరు 26న 12 మంది, 27న ఎనిమిది మంది, 28న ఆరుగురు మరణించారు. 22 నుంచి 28 నడుమ.. ఏడు రోజుల మరణాల సగటు కేవలం 31గా ఉంది. ఇలా దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య, ఇతర దేశాలకు ఈ వేరియంట్‌ వ్యాపించిన తీరు ప్రకారం చూస్తే.. ఒమైక్రాన్‌ వేరియంట్‌ డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తుందిగానీ, దానంత ప్రాణాంతకం కాదని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుత గణాంకాల ప్రకారం వేస్తున్న అంచనా మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే..


దీన్ని కారుచీకట్లో కాంతిపుంజంలాగానే భావించాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఎందుకంటే దీనికున్న వ్యాప్తివేగం వల్ల ప్రపంచమంతా విస్తృతంగా వ్యాపించి డెల్టా స్థానాన్ని భర్తీ చేస్తుంది. ప్రాణాంతకం కాదు కాబట్టి.. ఒమైక్రాన్‌ బారిన పడిన వారంతా  మామూలు జలుబు లక్షణాలతో బాధపడి, ఆ తర్వాత మామూలైపోతారు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు. వారికి ఈ వేరియంట్‌ సోకిన విషయమే తెలియకపోవచ్చు. కాబట్టి.. ఒమైక్రాన్‌ గురించి ఎక్కువగా భయపడొద్దని.. కొవిడ్‌ నిబంధనలను (మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌ వాడకం, భౌతికదూరం పాటించడం, జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలకు దూరంగా ఉండడం వంటివి) తప్పనిసరిగా పాటిస్తే సరిపోతుందని వైద్యులు, శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఒమైక్రాన్‌ ముప్పు తీవ్రమేనని ప్రకటించడం గమనార్హం.


ఉపసంహారం: దక్షిణాఫ్రికా జనాభా ఆరు కోట్లు. వారిలో 35ు మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇంకా ప్రభుత్వం వద్ద కోటిన్నరకు పైగా డోసుల టీకా నిల్వలున్నాయి. కానీ.. హెచ్‌ఐవీ, ఎబోలా వంటి మహమ్మారులను చూసిన ఆఫ్రికన్లు కరోనాకు పెద్దగా భయపడట్లేదు. దీనికితోడు కరోనా ఉధృతి కూడా ఇటీవలికాలంలో తగ్గింది. దీంతో అక్కడ వ్యాక్సిన్‌ వేయించుకునేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా.. సౌతాఫ్రికా సర్కారు ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థలకు నవంబరు 24న ఒక లేఖ రాసింది. ‘అయ్యా.. మా దగ్గర టీకాలు దండిగా ఉన్నాయి. వేసుకునేవారే లేరు. కాబట్టి సరఫరాకు కాస్తంత పగ్గాలు వేయండి’ అని దాని సారాంశం. యాదృచ్ఛికంగా అదే రోజు ‘ఒమైక్రాన్‌’ గురించి ప్రకటన వెలువడింది. ఆ తర్వాత రెండు రోజులకే డబ్ల్యూహెచ్‌వో సంస్థ దాన్ని ఆందోళన కారక వేరియంట్‌ (వీవోసీ)గా గుర్తించింది. డెల్టా వేరియంట్‌ విషయంలో డబ్ల్యూహెచ్‌వో ఇంత వేగంగా స్పందించలేదు. దాన్ని ‘వీవోసీ’గా ప్రకటించడానికి కొంత సమయం తీసుకుంది. టీకా కంపెనీల బలమైన లాబీనే దీని వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.భయం వద్దు.. జాగ్రత్త మేలు!


అదే నిజమైతే వరమే..

దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య ఈ ఏడాది జూలై 8న అత్యధికంగా 22,910గా నమోదైంది. నవంబరు 14న సున్నా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ నవంబరు 28 నాటికి కేసుల సంఖ్య 2,858కి చేరింది. కానీ, మరణాలు మాత్రం చాలా తక్కువగా నమోదవుతున్నాయి. నవంబరు 26న 12 మంది, 27న ఎనిమిది మంది, 28న ఆరుగురు మరణించారు. 22 నుంచి 28 నడుమ.. ఏడు రోజుల మరణాల సగటు కేవలం 31గా ఉంది. ఇలా దక్షిణాఫ్రికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య, ఇతర దేశాలకు ఈ వేరియంట్‌ వ్యాపించిన తీరు ప్రకారం చూస్తే.. ఒమైక్రాన్‌ వేరియంట్‌ డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తుందిగానీ, దానంత ప్రాణాంతకం కాదని వైద్యనిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుత గణాంకాల ప్రకారం వేస్తున్న అంచనా మాత్రమే. ఒకవేళ ఇదే నిజమైతే.. దీన్ని కారుచీకట్లో కాంతిపుంజంలాగానే భావించాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఎందుకంటే దీనికున్న వ్యాప్తివేగం వల్ల ప్రపంచమంతా విస్తృతంగా వ్యాపించి డెల్టా స్థానాన్ని భర్తీ చేస్తుంది. ప్రాణాంతకం కాదు కాబట్టి.. ఒమైక్రాన్‌ బారిన పడిన వారంతా  మామూలు జలుబు లక్షణాలతో బాధపడి, ఆ తర్వాత మామూలైపోతారు. రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారిలో ఆ లక్షణాలు కూడా కనిపించకపోవచ్చు. వారికి ఈ వేరియంట్‌ సోకిన విషయమే తెలియకపోవచ్చు. కాబట్టి.. ఒమైక్రాన్‌ గురించి ఎక్కువగా భయపడొద్దని.. కొవిడ్‌ నిబంధనలను (మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌ వాడకం, భౌతికదూరం పాటించడం, జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలకు దూరంగా ఉండడం వంటివి) తప్పనిసరిగా పాటిస్తే సరిపోతుందని వైద్యులు, శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. అయితే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఒమైక్రాన్‌ ముప్పు తీవ్రమేనని ప్రకటించడం గమనార్హం.


ఉపసంహారం: దక్షిణాఫ్రికా జనాభా ఆరు కోట్లు. వారిలో 35ు మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ఇంకా ప్రభుత్వం వద్ద కోటిన్నరకు పైగా డోసుల టీకా నిల్వలున్నాయి. కానీ.. హెచ్‌ఐవీ, ఎబోలా వంటి మహమ్మారులను చూసిన ఆఫ్రికన్లు కరోనాకు పెద్దగా భయపడట్లేదు. దీనికితోడు కరోనా ఉధృతి కూడా ఇటీవలికాలంలో తగ్గింది. దీంతో అక్కడ వ్యాక్సిన్‌ వేయించుకునేవారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఫలితంగా.. సౌతాఫ్రికా సర్కారు ఫైజర్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థలకు నవంబరు 24న ఒక లేఖ రాసింది. ‘అయ్యా.. మా దగ్గర టీకాలు దండిగా ఉన్నాయి. వేసుకునేవారే లేరు. కాబట్టి సరఫరాకు కాస్తంత పగ్గాలు వేయండి’ అని దాని సారాంశం. యాదృచ్ఛికంగా అదే రోజు ‘ఒమైక్రాన్‌’ గురించి ప్రకటన వెలువడింది. ఆ తర్వాత రెండు రోజులకే డబ్ల్యూహెచ్‌వో సంస్థ దాన్ని ఆందోళన కారక వేరియంట్‌ (వీవోసీ)గా గుర్తించింది. డెల్టా వేరియంట్‌ విషయంలో డబ్ల్యూహెచ్‌వో ఇంత వేగంగా స్పందించలేదు. దాన్ని ‘వీవోసీ’గా ప్రకటించడానికి కొంత సమయం తీసుకుంది. టీకా కంపెనీల బలమైన లాబీనే దీని వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement