కార్మిక సంక్షేమానికి బ్రేక్‌

ABN , First Publish Date - 2021-09-13T04:54:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధులు నిలిపివేసింది. దీంతో ఆ పథకం కింద 64 మందికి రూ.11.95లక్షలు అందలేదు. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని 2009 నుంచి అమలు చేస్తోంది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 34 విభాగాల కార్మికులందరూ దీనికి అర్హులే. ఇప్పటి వరకు ఈ పథకం కింద 4,349 మంది లబ్ధి పొందారు. వారికి కార్మిక నుంచి శాఖ రూ.8,90,65,000 చెల్లించారు.

కార్మిక సంక్షేమానికి బ్రేక్‌

నిలిచిన నిధులు 

పెండింగ్‌లో 64 మంది దరఖాస్తులు


నెల్లూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 12 : రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధులు నిలిపివేసింది. దీంతో ఆ పథకం కింద  64 మందికి రూ.11.95లక్షలు అందలేదు. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని 2009 నుంచి అమలు చేస్తోంది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 34 విభాగాల కార్మికులందరూ దీనికి అర్హులే. ఇప్పటి వరకు ఈ పథకం కింద 4,349 మంది లబ్ధి పొందారు. వారికి కార్మిక నుంచి శాఖ రూ.8,90,65,000 చెల్లించారు. 


అర్హతలు ఇవి...

భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తుండాలి. వయసు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి

సంవత్సరంలో 90 రోజులు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసి ఉండాలి. 

సభ్యత్వం రూ.50, చందా ఏడాదికి రూ.12 చొప్పున ఐదేళ్లకు రూ.60 కలిపి మొత్తం రూ.110 చెల్లించాలి. రెండు ఫొటోలు, ఆధార్డ్‌ కార్డు తప్పనిసరిగా జత చేయాలి. 


ప్రయోజనాలు

ప్రమాదవశాత్తు మరణించిన కార్మికునికి రూ.5లక్షలు చెల్లిస్తారు. అంగవైకల్యానికి గురైన వారికి వైకల్య శాతం ప్రకారం రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు పరిహారం చెల్లిస్తారు. పూర్తి అంగవైకల్యం కలిగిన కార్మికునికి రూ.5లక్షలు చెల్లిస్తారు. 

కార్మికుడికి సహజ మరణం సంభవిస్తే కుటుంబానికి రూ.60వేలు ఆర్థిక సాయం, దహస సంస్కారాలకు రూ.20వేలు చెల్లిస్తారు. 

కార్మికులకు వివాహం కాని ఇద్దరు కుమార్తెలకు బహుమతిగా రూ.20వేలు, అలాగే వారి ప్రసూతి సాయం కింద కాన్పుకి రూ.20వేలు చొప్పున రెండు కాన్పులకు అందజేస్తారు. 

ఫ తాత్కాలిక అంగవైకల్యం, అనారోగ్యానికి గురైన కార్మికునికి నెలకి రూ.3వేలు చొప్పున 3నెలలుకి రూ.9వేలను కార్మికశాఖ అందజేస్తుంది.

భవన కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు కాబడిన కార్మికులకు నైపుణ్యాభివృద్ధికి 15రోజులు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి రోజుకి రూ.300 చొప్పున శిక్షణ భృతి, రూ.2500 విలువ కలిగిన పనిముట్లు అందజేస్తారు. 


కార్మిక సంక్షేమ బోర్డుకు కార్మికులు చెల్లించే సభ్యత్వ రుసుము, చందాలతోపాటు ప్రజల నుంచి వసూలు చేసిన సెస్సులు ద్వారానే  నిధులు సమకూరుతాయి. వాటితో  సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. రూ.10లక్షలు పైబడిన గృహ నిర్మాణాలు చేపట్టే యజమానుల నుంచి, వాణిజ్య సముదాయాల నిర్మాణాల నుంచి, రోడ్ల నిర్మాణ కాంట్రాక్టరు నుంచి ప్రభుత్వం వసూలు చేసే పన్నుల నుంచి కార్మిక సంక్షేమ నిధికి నిధులు జమ అవుతాయి. ఇందులో ప్రభుత్వం నేరుగా ఒక్క పైసా కూడా ఈ నిధులకు జమ చయదు. 2009 నుంచి జిల్లాలో కార్మిక శాఖ వసూలు చేసిన సెస్సులు రూ.79,54,28,164 వసూలు కాగా, సెప్టెంబరు నెలలో ఇప్పటి వరకు రూ.50వేలు వసూలు చేశారు. 


త్వరలో నిధులు విడుదల అవుతాయి

- డిప్యూటీ కమిషనర్‌ ఎం వెంకటేశ్వరరావు

గత ఏప్రిల్‌ నుంచి కార్మిక సంక్షేమ బోర్డు నుంచి నిధులు రాకపోవడంతో జిల్లాలో 64 మందికి సంక్షేమ నిధులు అందలేదు. ప్రస్తుతం కార్మిక సంక్షేమ బోర్డుకు కార్యవర్గాన్ని నియమించారు. త్వరలో నిధులు విడుదల అవుతాయి. 

Updated Date - 2021-09-13T04:54:08+05:30 IST