లాక్‌డౌన్ పొడిగించే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టత

ABN , First Publish Date - 2020-03-30T16:07:55+05:30 IST

విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీ

లాక్‌డౌన్ పొడిగించే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టత

న్యూఢిల్లీ: విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లిన వాళ్లు తమ స్వగ్రామాలకు చేరుకోలేక తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిని మరోవార్త మరింత భయాందోళనకు గురి చేసింది. కరోనా సోకిన వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో.. ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం మరిన్ని రోజులు పొడిగిస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. 


అయితే వీటిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ‘‘ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తుందని వస్తున్నవి పుకార్లు మాత్రమే. ఆ వార్తలు నిరాధారమైనవి’’ అని కాబినేట్ సెక్రటరీ రాజీవ్ గౌబా తెలిపారు. 


సోమవారం ఉదయం రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వార్తలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన కేంద్రానికి లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2020-03-30T16:07:55+05:30 IST