పెద్దలందరికీ 3 నెలల్లో టీకాలు వేయాలి: సీఎం

ABN , First Publish Date - 2021-05-08T02:18:10+05:30 IST

పెద్దలందరికీ 3 నెలల్లో టీకాలు వేయాలి: సీఎం

పెద్దలందరికీ 3 నెలల్లో టీకాలు వేయాలి: సీఎం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇప్పుడు ఆక్సిజన్ కొరత లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు. నగరంలోని పెద్దలందరికీ టీకాలు వేయడంతో కోవిడ్ -19 టీకా డ్రైవ్ మూడు నెలల వ్యవధిలో ముగియాలని సీఎం తెలిపారు. ఉన్నత స్థాయి ప్రభుత్వ సమావేశంలో మాట్లాడుతూ తనిఖీ కోసం రోజూ 2-3 టీకా కేంద్రాలను సందర్శించాలని సీఎం జిల్లా అధికారులను ఆదేశించారు.


మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కట్టడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 19,832 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వల్ల 341 మంది మృతి చెందారని వైద్య శాఖ వెల్లడించింది. ఢిల్లీలో ప్రస్తుతం 91,035 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 12,92,867 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారం మొత్తం 1,14,657 మంది లబ్ధిదారులకు టీకాలు వేయగా, వారిలో 80,306 మందికి మొదటి డోసు వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-05-08T02:18:10+05:30 IST