ఢిల్లీలో లాక్‌డౌన్ విధించబోం, కానీ.. : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-04-10T21:17:13+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వేళ లాక్‌డౌన్ తప్పదంటూ

ఢిల్లీలో లాక్‌డౌన్ విధించబోం, కానీ.. : కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వేళ లాక్‌డౌన్ తప్పదంటూ వస్తున్న వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్ విధించబోవడం లేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని ఆంక్షలు మాత్రం తప్పవని పేర్కొన్నారు.  చాలినన్ని కరోనా డోసులు అందుబాటులో ఉండి, వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఉన్న వయసు పరమైన ఆంక్షలను తొలగిస్తే రెండుమూడు నెలల్లో ఢిల్లీ ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎం పేర్కొన్నారు. 


ప్రస్తుతం ఉన్న టీకా నిల్వలు మరో వారం నుంచి పది రోజులు మాత్రమే సరిపోతాయన్నారు. వయసు పరమైన ఆంక్షలను ఎత్తివేసి, వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాల్సి ఉందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండబోదని పునరుద్ఘాటించిన సీఎం.. త్వరలోనే కొత్త ఆంక్షలు విధిస్తామని విధిస్తామన్నారు. 

Updated Date - 2021-04-10T21:17:13+05:30 IST