చాణక్య నీతి: మగువలలోని ఈ మూడు అలవాట్లను ఏ పురుషుడూ సహించేడు.. భార్యాభర్తల మధ్య గొడవలకు ఇదొక కారణం!

ABN , First Publish Date - 2021-12-20T11:44:08+05:30 IST

ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి అలవాట్లు..

చాణక్య నీతి: మగువలలోని ఈ మూడు అలవాట్లను ఏ పురుషుడూ సహించేడు.. భార్యాభర్తల మధ్య గొడవలకు ఇదొక కారణం!

ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి అలవాట్లు మరికొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. తనలో లక్షల చెడు గుణాలు ఉన్నప్పటికీ, ఇతరులలోని ఒక్క చెడు గుణం ఉన్నా దానిని ఏ వ్యక్తి కూడా సహించలేడు. ఇదేవిధంగా భార్యలో ఉండే ఈ మూడు అలవాట్లను భర్త ఎప్పటికీ సహించలేడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయి. సాధారణంగా స్త్రీలలో ఉండే ఆ మూడు అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్య స్త్రీల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. 


తన భార్య తనతో కాకుండా పరాయి పురుషునితో చనువుగా మాట్లాడటాన్ని ఏ భర్తా సహించలేడు. భర్త మనసులో ఎటువంటి తప్పుడు ఆలోచన లేకున్నా అతను తన భార్య ఇంకొక మగవాడితో మాట్లాడితే సహించలేడు. ఇక స్త్రీలలోని మరో అలవాటు విషయానికొస్తే కొంతమంది మహిళలు చిటికీమాటికీ, అయినదానికి కానిదానికీ కోపం వ్యక్తం చేస్తుంటారు. దీనిని ఏ భర్త సహించలేడు. పైగా ఇటువంటి సందర్భాల్లో భర్త ఏమనకుంటాడోనని కూడా ఆలోచించకుండా స్త్రీలు తమ చికాకును ప్రదర్శిస్తారు. దీనిని ఏ భర్తా సహించలేడు. స్త్రీలు.. మోసం చేయడాన్ని ఏ పురుషుడూ సహించలేడు. మోసం చేయడం అనేది చాలా చెడ్డ గుణం. ఇది మహిళల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటుందని ఆచార్య చాణక్య తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-20T11:44:08+05:30 IST