మాస్కు ధరించకపోతే రూ.200 జరిమానా

ABN , First Publish Date - 2021-06-24T14:14:36+05:30 IST

మెట్రో రైళ్లలో మాస్కు లేకుండా ప్రయాణించే వారికి రూ.200 జరిమానా విధిస్తామని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) హెచ్చరించింది. ఈ మేరకు సీఎంఆర్‌ఎల్‌ విడుదల చేసిన ప్రకటనలో, నగరం

మాస్కు ధరించకపోతే రూ.200 జరిమానా


పెరంబూర్‌(చెన్నై): మెట్రో రైళ్లలో మాస్కు లేకుండా ప్రయాణించే వారికి రూ.200 జరిమానా విధిస్తామని చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) హెచ్చరించింది. ఈ మేరకు సీఎంఆర్‌ఎల్‌ విడుదల చేసిన ప్రకటనలో, నగరం లో కరోనా నియంత్రణలోకి రావడంతో లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలింపులను రాష్ట్రప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీంతో, వింకోనగర్‌ -విమానాశ్రయం, డా.ఎంజీఆర్‌ సెంట్రల్‌-సెయింట్‌ థామస్‌ మౌంట్‌ మధ్య 50 శాతం మంది ప్రయాణికులతో మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యా యన్నారు, తొలిరోజైన సోమవారం 29 వేల మంది ప్రయాణించగా, మంగళ వారం 34 వేలకు పెరిగిందన్నారు. కోయంబేడు బస్‌ టెర్మినల్‌, సెంట్రల్‌, విమానాశ్రాయం తదితర స్టేషన్లల రద్దీ అధికంగా ఉందని తెలిపారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా మెట్రో రైల్వేస్టేషన్లలో ఏసీ వినియోగం నిలిపివేశామన్నారు. 

Updated Date - 2021-06-24T14:14:36+05:30 IST