Jun 3 2021 @ 19:50PM

అలా పిలవడం ఎందుకమ్మా!

లింగ భేదం, వృత్తిని బట్టి లేకుండా తనని పేరుతో పిలిస్తేనే సంతోషమంటున్నారు దర్శకురాలు నందినీరెడ్డి.  మొదటి సినిమా ‘అలా మొదలైంది’తో దర్శకురాలిగా తన సత్తా చాటారు నందినీ. ‘జబర్దస్త్‌’, ‘కల్యాణ వైభోగమే’, ‘ఓ బేబీ’ సినిమాలతో కూడా ఆమె ఆకట్టుకున్నారు. లేడీ డైరెక్టర్‌ అనే ట్యాగ్‌పై ఆమె ఇన్‌స్టా వేదికగా స్పందించారు. జెండర్‌ ఆధారంగా వచ్చే ఐడెంటిటీ కంటే పేరుతోనే పిలిేస్తనే బాగుంటుందన్నారామె! ‘‘లేడీ డైరెక్టర్‌, నందినీ రెడ్డి  ఈ రెండింటికీ  ఇంగ్లీష్‌ అక్షరాలు పన్నెండే కదా! రాయాలంటే ఒకేలా శ్రమ పడాలి. చక్కగా నందినీ రెడ్డి అని నా పేరు వాడితే సంతోషిస్తా. అనవసరంగా ఈ లింగ భేదాలతో లేడీ డైరెక్టర్‌, కేడీ డైరెక్టర్‌ అంటూ ఎందుకమ్మా?’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాన్ని తెలిపాకె. ఈ విషయంలో నందినీకి కామెంట్ల రూపంలో చాలామంది మద్దతుగా నిలిచారు.