మందులిచ్చి.. గాలికొదిలేస్తున్నారు.. కరోనా బాధితులపై పట్టింపేదీ?

ABN , First Publish Date - 2020-07-24T16:05:18+05:30 IST

జిల్లాలో రోజు రోజుకూ కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తు తం వైరస్‌ బారిన పడుతున్నది పేద, మధ్యతరగతి ప్రజలే. పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో స్తోమతలేని వారు హోంక్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుం టున్నారు.

మందులిచ్చి.. గాలికొదిలేస్తున్నారు.. కరోనా బాధితులపై పట్టింపేదీ?

పాజిటివ్‌ బాధితులపై అంతులేని వివక్ష

ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోని  జిల్లా వైద్యాధికారులు 

మందులిచ్చి.. గాలికొదిలేస్తున్న దైన్యం.. 

స్థానికుల నుంచి మనో ధైర్యమూ కరువే!

తీవ్ర మనోవేదనకు గురవుతున్న కరోనా బాధితులు 


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోజు రోజుకూ కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తు తం వైరస్‌ బారిన పడుతున్నది పేద, మధ్యతరగతి ప్రజలే. పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో స్తోమతలేని వారు హోంక్వారంటైన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకుం టున్నారు. కానీ వీరి పట్ల స్థానికుల నుంచి అంతులేని వివక్షత ఎదురవుతోంది. కరోనా సోకిందంటే చాలు ఆ బాధితులను ఏదో సమాజం నుంచి వెలివేసినట్లుగా చూస్తున్నారు. ఇక అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పాజిటివ్‌ నిర్ధారణ అయిందంటే బాధితులను హోం ఐసోలేషన్‌కు పంపి మందులు ఇచ్చి కన్నెత్తి చూడడం లేదనే వాధన బాధితుల నుంచి వినిపిస్తోంది. ఇలాంటి సంఘటన లను ఎదుర్కొన్న కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ కరోనా బాధితుడు ‘ఆంధ్రజ్యోతి’తో తన ఆవేదనను వెల్లబుచ్చాడు. 


కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ లెక్చరర్‌గా పని చేస్తుంటారు. బాధితుడికి ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా ఐదురోజుల కిందట పాజిటి వ్‌గా నిర్ధారణ అయింది. దీంతో సదరు బాధితున్ని వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ఇంట్లోనే హోంక్వారంటైన్‌లో ఉంచారు. కరోనాకు సంబంధించిన మందులను ఇచ్చి స్థానిక పరిసరాలను శానిటైజర్‌ చేసి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా బాధితుడి దగ్గరకు వచ్చి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగే నాథుడే రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట్లో ఇద్దరు పిల్లలతో పాటు భార్య, అమ్మ ఉంటారని కనీసం వారికి కూడా ఇప్పటి వరకు ఎలాం టి వైద్యపరీక్షలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం నా పైనే ఆధారపడి ఉందని కనీసం బయటకు వెళ్లి మంచినీరు సైతం తెచ్చుకోలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. 


కనీసం చుట్టు పక్కల వారు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదన్నారు. కుటుంబ సభ్యులు బయటకు వెళితే చాలు చుట్టు పక్కల వారు దగ్గరకు రావద్దంటూ సూటి పోటి మాటాలతో మనసును గాయపరుస్తున్నారంటూ వివరించా రు. ఇప్పటికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేకున్నా మా కుటుంబాన్ని సమాజం నుంచి వెలివేసినట్లు ప్రతి ఒక్కరూ చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు సహాయ సహకారాలు అందించాలని బాధితుడు కోరాడు.


దీనస్థితిలో ఎంతోమంది కరోనా బాధితులు 

కామారెడ్డి పట్టణంలో అయ్యప్పనగర్‌ కాలనీకి చెందిన కరోనా బాధితుడి మాదిరిగానే ఇదే పట్టణంలో మరికొందరి బాధితులకు ఇలాంటి దుస్థితే ఎదురైంది. పట్టణంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా అద్దె ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందినప్పటికీ రెం డోసారి పరీక్షలో పాజిటివ్‌గానే నిర్ధారణ అయిం ది. దీంతో వైద్యనిపుణుల సూచన మేరకు అద్దెకు ఉన్న ఇంట్లో సరైన సౌకర్యాలు లేవని తన బంధు వుల ఇంటికి వెళ్లగా అక్కడి కాలనీవాసులు సూటి పోటి మాటలతో అతని మనసును గాయపరచ డంతో పాటు ఇంటికి సరుకులు తెచ్చిన వారిని సైతం బెదిరింపులకు గురి చేశారు. దీంతో ఆ బాధితుడు వైద్యఆరోగ్యశాఖ సిబ్బందికి సమాచారం అందించ డంతో వారు వచ్చి నచ్చచెప్పినా కాలనీవాసులు వినిపించుకోకపో వడమే కాక ప్రజాప్రతినిధులతో తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో దిక్కులేని పరిస్థితుల్లో తిరిగి తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోకే వెళ్లాల్సి వచ్చింది. భిక్కనూర్‌ మండ లం జంగంపల్లిలో సైతం ఓ కరోనా బాధి తురాలి కుటుంబసభ్యులను గ్రామంలోకి రానివ్వ లేని పరిస్థితి ఎదురైంది. బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్‌లో కరోనా బారిన పడ్డ బాధితుల పట్ల స్థానికంగా ఉండే కొందరు వివక్షత చూపినట్లు తెలుస్తోంది.


పట్టించుకోని అధికారులు

జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య సుమారు 500లకు పైగానే చేరింది. పట్టణ ప్రాంతాల్లో కరో నా బాధితుల పట్ల వివక్షత కొనసాగుతుంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో బాధితుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో కరోనా బారిన పడిన వారు చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలే ఉంటున్నారు. ప్రభుత్వపరంగా స్థానికంగా క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాజిటివ్‌ నిర్ధారణ అయిన పేద, మధ్యతరగతి వారు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆసుపత్రిలో చికిత్స చేసుకోలేక హోంక్వారంటైన్‌లోనే ఉంటున్నా రు. దీనిపై స్థానిక అధికారులు వైద్యఆరోగ్యశాఖ, రెవెన్యూవారి పర్యవేక్షణ లేకుండా పోతుందనే విమర్శలు వస్తున్నాయి. మందులు ఇవ్వడం మినహాయిస్తే ఇతర ఎలాంటి సహాయ సహకా రాలు అందడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల వారు దగ్గరకు రానివ్వకపోవడం బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో బాధితులు ఉండడంతో ప్రతీరోజు అధికారులు, ఆరోగ్యసిబ్బంది బాధితుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఉంది. కానీ మొదటి రోజు మాత్రమే అధికారులు బాధితులను పర్యవేక్షణ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నా యి. ఉన్నతాధికారులు స్పందించి కరోనా బాధి తుల పట్ల ప్రతీరోజు పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated Date - 2020-07-24T16:05:18+05:30 IST