ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ చెల్లించవద్దు : పుత్తా

ABN , First Publish Date - 2021-12-04T05:02:59+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారుల నుంచి వసూలు చేసే ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ చెల్లించవద్దని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు.

ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ చెల్లించవద్దు : పుత్తా
ఇందుకూరులో దెబ్బతిన్న ఉల్లిపంటను పరిశీలిస్తున్న పుత్తా

వీరపునాయునిపల్లె, డిసెంబరు 3: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారుల నుంచి వసూలు చేసే ఓటీఎస్‌ డబ్బులు ఎవరూ చెల్లించవద్దని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల టీడీపీ కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్రెడ్డి ప్రసాదరెడ్డిల అధ్యక్షతన పాయసంపల్లె, ఉరుటూరు, ఇందుకూరు, ఎన్‌.పాలగిరి గ్రామాల్లో భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న బుడ్డశనగ, మినుము, పెసర, ఉల్లి, తదితర పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్‌ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రసాదరెడ్డి, సర్వరాజుపేట సర్పంచు చిన్ననారాయణరెడ్డి, మాజీ సర్పంచు వెంకటరమణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నాగమునిరెడ్డి, టీడీపీ కార్యకర్తలు లక్ష్మిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు.


డబ్బులు ఎవరూ కట్టొద్దు : అమీర్‌బాబు

కడప, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి):  జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన వనటైమ్‌ సెటిల్మెంట్‌ పథకానికి ఎవరూ డబ్బులు కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచితంగానే లబ్ధిదారుల పేరిట రిజిస్ర్టేషన్‌ చేస్తామని కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ అమీర్‌బాబు పిలుపునిచ్చారు. గౌరవ సభలో భాగంగా శుక్రవారం 26, 27వ డివిజన్‌లో గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, నక్కల శివరామ్‌, బాలదాసు, జయకుమార్‌, మాసాపేట శివ, మహిళా అధ్యక్షురాలు సునీత, పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షురాలు మౌనిక తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:02:59+05:30 IST