Abn logo
Apr 8 2020 @ 05:30AM

ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు

వృద్ధులు, రోజువారీ కార్మికులు, పేదలకు లాక్‌డౌన్‌ సమయంలో భోజన సదుపాయం కల్పించడానికి హిందీ కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ ముందుకొచ్చారు. అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రతిరోజూ 1.2లక్ష మందికి ఆయన భోజనం పెడుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ హృతిక్‌ సహకారంతో దేశవ్యాప్తంగా వృద్ధాశ్రమాలు, పేద ప్రజలకు ఆరోగ్యకరమైన భోజనం అందివ్వడం సంతోషంగా ఉందని అక్షయ పాత్ర ట్వీట్‌ చేసింది. ‘‘దేశంలో ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూసుకొనే శక్తి అక్షయ పాత్రకు రావాలని కోరుకుంటున్నా. మీరే నిజమైన సూపర్‌ హీరోలు. మనమంతా మన శక్తి మేరకు సహాయం చేద్దాం. సహాయం ఏదైనా చిన్నది లేదా పెద్దది కాదు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని హృతిక్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement