Advertisement
Advertisement
Abn logo
Advertisement

బయట తిండి తినొద్దు!

మీకు తెలిసే ఉంటుంది.. బయట తిండి మంచిదే కాదని! పెద్దలు ఈ మాట చెబుతూనే ఉంటారు. ఇది నిజమే. రోజూ రెస్టారెంట్‌లో ఫుడ్‌ తినేవారికి ఇబ్బందే అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి ఒకసారి రెస్టారెంట్‌లో ఆహారం తినేవారితో పోలిస్తే.. రోజుకి రెండుసార్లు రెస్టారెంట్‌లో ఆహారం తీసుకునేవారికి 49 శాతం రిస్క్‌ ఎక్కువ. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లోవా చేసిన తాజా అధ్యయన సారమిది. గతంలో కూడా ఇలాంటి అధ్యయనాలు వెలువడ్డాయి.  2015లో యూరోపియన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌ విభాగం వారు ఇంటి ఆహారంతో పోలిస్తే.. హోటల్‌ ఫుడ్‌లో బ్యాలెన్స్‌ ఉండదని, రంగుకోసం, రుచికోసం కలిపే కొన్ని రకాల పదార్థాలు ఇబ్బంది కలిగిస్తాయని వెల్లడించారు. సోడియంతో పాటు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను, శాచురేటెడ్‌ ఫ్యాట్‌ను పెంచే వాటిని రెస్టారెంట్స్‌లో వాడతారు. రెస్టారెంట్‌ ఫుడ్‌ మంచిదే కానీ ఇంటి భోజనంతో పోలిస్తే కాదని నిపుణులు చెబుతున్నారు. మనం ఇంట్లో భోజనం చేసుకునేప్పుడు ఆచితూచి జాగ్రత్తగా వండుకుంటాం. అందుకే ఇంటి భోజనమే బెస్ట్‌ అంటున్నారు నిపుణులు.

Advertisement
Advertisement