జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ ఏదీ?: వైసీపీ ఎమ్మెల్యే కాటసాని

ABN , First Publish Date - 2020-08-05T09:13:13+05:30 IST

కొవిడ్‌ బాధితులకు సరైన వైద్యం అందడం లేదని రాయలసీమకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై అసంతృప్తి

జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ ఏదీ?: వైసీపీ ఎమ్మెల్యే కాటసాని

కర్నూలు, ఆగస్టు 4: కొవిడ్‌ బాధితులకు సరైన వైద్యం అందడం లేదని రాయలసీమకు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జీజీహెచ్‌ రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రిలో కరోనా బాధితులకు సరిపడ ఆక్సిజన్‌ అందడం లేదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆక్షేపించారు. జిల్లాలో కొవిడ్‌ నివారణ చర్యలపై కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని మంగళవారం సమీక్షించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు జీజీహెచ్‌లో సరిగ్గా వైద్యసేవలు ఎందుకు అందడం లేదని అధికారులను నిలదీశారు. అలాగే మద్దూరు పీహెచ్‌సీలో వైద్యులు లేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ కూడా కర్నూలు కొవిడ్‌ ఆసుపత్రిలో మెరుగైన సేవలందించాలని కోరారు. 

Updated Date - 2020-08-05T09:13:13+05:30 IST