వివాహాలు ఇళ్లలోనే.. మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-05-14T06:14:26+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో ఇక ఫంక్షన్‌ హాళ్లలో వివాహాలరను నిలిపివేస్తూ.. ఇళ్లల్లో శుభకార్యాలు చేసుకోవాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

వివాహాలు ఇళ్లలోనే..  మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

ఫంక్షన్‌హాళ్లలో నిర్వహణకు అనుమతుల్లేవ్‌ 

ఖమ్మంటౌన్‌, మే 13: కొవిడ్‌ నేపథ్యంలో ఇక ఫంక్షన్‌ హాళ్లలో వివాహాలరను నిలిపివేస్తూ.. ఇళ్లల్లో శుభకార్యాలు చేసుకోవాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అదికూడా పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులను అనుమతిస్తుండగా.. ఇందుకు తహసీల్దార్ల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అనుమతులపై తహసీల్దార్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలనిచ్చింది. వివా హానికి వరుడు, వధువు తరపున 20మంది చొప్పున మాత్రమే హాజరయ్యే ందుకు అనుమతినిస్తున్నారు. ఇందులో పురోహితుడిని కలుపుతున్నారు. వరు డు, వధువుల ఆధార్‌కార్డులు, అలాగే వయస్సు ధ్రువీకరణ పత్రాలు, తరపున 20మంది మాత్రమే హాజరవుతున్నట్టు ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. అ యితే ఈ నిర్ణయంతో ఫంక్షన్‌హాళ్లు బుక్‌ చేసుకున్న వారు లబోదిబోమంటున్నారు. అయితే కొందరు యజమానులు అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికిప్పుడు ఇళ్లలో ఏర్పాట్లు చేసుకోలేక కొందరు వివాహాలను వాయిదా వేసుకుంటున్నారు. 

22, 23తేదీల్లో వివాహాలకు భారీగా దరఖాస్తులు

అయితే ఈనెల 22, 23 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ తేదీల్లో వివాహాలకు అనుమతులు కోరుతూ గురువారం భారీగా దరఖాస్తులు అందాయి. అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి 10ధరఖాస్తులు వచ్చినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు.


Updated Date - 2021-05-14T06:14:26+05:30 IST