Parliament భవనం ముందు నిరసనకు అనుమతి లేదు :Delhi పోలీసులు

ABN , First Publish Date - 2021-07-18T23:20:03+05:30 IST

పార్లమెంట్ భవనం ముందు నిరసన తెలపడానికి రైతులకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

Parliament భవనం ముందు నిరసనకు అనుమతి లేదు :Delhi పోలీసులు

న్యూఢిల్లీ : పార్లమెంట్ భవనం ముందు నిరసన తెలపడానికి రైతులకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారం రైతుల నిరసనకు అనుమతి ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు. ఈ విషయంలో రైతు సంఘాలు పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, మళ్లీ కేసులు పెరగడానికి ఉపకరించే ఎలాంటి చర్యలకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పారు. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే దానిని ఉల్లంఘించే ఏ చర్యకూ అనుమతించమని పోలీసులు పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్న విషయం విదితమే. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్ భవనం ముందు తమ నిరసన తెలుపుతామని రైతు సంఘాలు ప్రకటించాయి. పార్లమెంట్ సమావేశాల ముగింపు వరకూ తమ నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. 

Updated Date - 2021-07-18T23:20:03+05:30 IST