‘బిజినెస్‌ క్లాస్‌’కు నో క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-06-06T07:52:36+05:30 IST

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమై పక్షం రోజులు గడిచినా.. చాలా మంది ప్రయాణికుల్లో రాష్ట్రాల వారీగా క్వారంటైన్‌ నిబంధనలపై స్పష్టత లేదు. ఏ రాష్ట్రంలో

‘బిజినెస్‌ క్లాస్‌’కు నో క్వారంటైన్‌

  • విమాన ప్రయాణికులకు మినహాయింపు.. మూడు రాష్ట్రాల్లోనే షరతులతో ఈ అవకాశం


సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమై పక్షం రోజులు గడిచినా.. చాలా మంది ప్రయాణికుల్లో రాష్ట్రాల వారీగా క్వారంటైన్‌ నిబంధనలపై స్పష్టత లేదు. ఏ రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలియక.. ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఏయే రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయనే వివరాలను ‘ఆంధ్రజ్యోతి’ సేకరించింది. కర్ణాటక, మహారాష్ట్ర సహా.. కొన్ని రాష్ట్రాల్లో బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులకు క్వారంటైన్‌ లేదు. అయితే.. కొన్ని షరతులు ఉన్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా వేర్వేరు క్వారంటైన్‌ నిబంధనలు ఇలా ఉన్నాయి.


కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు అనుమతి తప్పనిసరి

అండమాన్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌, మిజోరాం, రాజస్థాన్‌, త్రిపుర, ఒడిసా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌: 14 రోజుల హోంక్వారంటైన్‌

ఆంధ్రప్రదేశ్‌: స్పందన వెబ్‌సైట్‌(వెబ్‌ లింక్‌: spandana.ap.gov.in )లో ముందుగా అనుమతి తీసుకోవాలి. మహారాష్ట్ర, చెన్నై, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఏడు రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌, 7 రోజుల హోంక్వారంటైన్‌ తప్పనిసరి. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవారికి 14 రోజుల హోంక్వారంటైన్‌ సరిపోతుంది.

అసోం: గర్భిణులు, 75 ఏళ్ల పైబడినవారు, పదేళ్లలోపు చిన్నపిల్లలు, అంత్యక్రియలకు వెళ్లేవారు, దివ్యాంగులు, మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారు, పేషెంట్ల అటెండెంట్లు మినహా.. మిగతా అందరికీ 7 రోజులు ఇన్‌స్టిట్యూషనల్‌, ఆ తర్వాత 7 రోజులు హోంక్వారంటైన్‌ తప్పనిసరి

బిహార్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ: ఎలాంటి క్వారంటైన్‌ లేదు

ఛత్తీ‌స్‌గఢ్‌: ఈ-పాస్‌ (వెబ్‌లింక్‌: http://epass.cgcovid19.in ) తీసుకున్నవారే ప్రయాణించాలి. 14 రోజుల హోంక్వారంటైన్‌ తప్పనిసరి

ఢిల్లీ, హరియాణా: ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి. కరోనా లక్షణాలున్న వారికే 14 రోజుల హోం క్వారంటైన్‌

గోవా: ప్రయాణానికి రెండ్రోజుల ముందు కొవిడ్‌-19 నెగటివ్‌ తేలినవారికి ఎలాంటి క్వారంటైన్‌ అక్కర్లేదు. మిగతావారు విమానాశ్రయంలో రూ. 2 వేలు చెల్లించి, కొవిడ్‌-19 పరీక్ష చేయించుకోవాలి. ఫలితాలు వచ్చేదాకా స్వీయ నిర్బంధం(సెల్ఫ్‌ ఐసోలేషన్‌)లో ఉండాలి.

హిమాచల్‌ప్రదేశ్‌: ఆరోగ్యసేతు తప్పనిసరి. కొవిడ్‌ నెగటివ్‌ రిపోర్టు ఉన్నవారికి 14 రోజుల హోంక్వారంటైన్‌.. మిగతావారికి ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌

జమ్మూకశ్మీర్‌: విమానాశ్రయంలో దిగగానే కొవిడ్‌-19 పరీక్ష, 14 రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ ఉంటుంది

కర్ణాటక: సేవాసింధు పోర్టల్‌ (వెబ్‌లింక్‌: https://sevasindhu.karnataka.gov.in/Sevasindhu/English )లో ఈ-పాస్‌ తీసుకోవాలి. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి 7 రోజుల ఇన్‌స్టిట్యూషనల్‌, మరో 7 రోజుల హోంక్వారంటైన్‌. బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులకు వారంలో తిరిగి వెళ్లేలా రిటర్న్‌ టికెట్‌ ఉంటే.. ఎలాంటి క్వారంటైన్‌ అవసరం లేదు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోంక్వారంటైన్‌ తప్పనిసరి. హోంక్వారంటైన్‌ నుంచి గర్భిణులు, 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, మెడికల్‌ ఎమర్జెన్సీ ఉన్నవారు, అంత్యక్రియలకు హాజరయ్యేవారికి మినహాయింపు

కేరళ: ఈ-పాస్‌ (వెబ్‌లింక్‌: https://covid19jagratha.kerala.nic.in ) తప్పనిసరి. వారంలో తిరిగివెళ్లే బిజినెస్‌ క్లాస్‌ ప్రయాణికులకు ఎలాంటి క్వారంటైన్‌ ఉండదు. మిగతావారికి 14 రోజుల హోంక్వారంటైన్‌

మణిపూర్‌: ఈ-పాస్‌ (వెబ్‌లింక్‌: https://quarmonmanipur.nic.in ), 14 రోజుల హోం క్వారంటైన్‌ తప్పనిసరి

మహారాష్ట్ర: ఆరోగ్యసేతు తప్పనిసరి. ఏడు రోజుల్లో తిరిగి వెళ్లే వారికి ఎలాంటి క్వారంటైన్‌ ఉండదు. మిగతావారికి 14 రోజుల హోంక్వారంటైన్‌

మేఘాలయ: ఈ-పాస్‌ (వెబ్‌లింక్‌: http://meghalayaonline.gov.in/ covid/registerall.html ), 48 గంటల ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ ఉంటాయి.

నాగాలాండ్‌: 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులు, గర్భిణులకు మాత్రమే 28 రోజుల క్వారంటైన్‌ (14 రోజులు ఇన్‌స్టిట్యూషనల్‌, మరో 14 రోజులు హోంక్వారంటైన్‌) తప్పనిసరి

తమిళనాడు: ఈ-పాస్‌ ( https://tnepass.tnega.org/ ) తప్పనిసరి. 14 రోజుల క్వారంటైన్‌

ఉత్తరాఖండ్‌: రెడ్‌ జోన్ల నుంచి వచ్చేవారికి 7 రోజుల ఉచిత/పెయిడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌. ఆ తర్వాత 7 రోజుల హోంక్వారంటైన్‌. మిగతావారికి 14 రోజుల హోంక్వారంటైన్‌. ఈ-పా్‌స(వెబ్‌లింక్‌:  https://dsclservices.in/uttarakhandmigrantegistration.php ) తప్పనిసరి

పశ్చిమబెంగాల్‌: ఆన్‌లైన్‌లో హెల్త్‌ డిక్లరేషన్‌ సరిపోతుంది.

Updated Date - 2020-06-06T07:52:36+05:30 IST