రాయచోటి వద్దు... రాజంపేట ముద్దు

ABN , First Publish Date - 2022-01-29T05:11:52+05:30 IST

రాయచోటి వద్దు...రాజంపేట ముద్దు నినాదంతో శుక్రవారం రైల్వేకోడూరు పట్టణం మార్మోగింది. రైల్వేకోడూరు జేఏసీ, అఖిలపక్షం నాయకులు, కోడూరు స్టూడెంట్‌ యూనియన్‌ ఫోర్స్‌, విద్యార్ధి సంఘాల నేతలు, విద్యార్ధులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

రాయచోటి వద్దు... రాజంపేట ముద్దు
కోడూరులో ర్యాలీ నిర్వహిస్తున్న ఆఖిలపక్షం నాయకులు

రైల్వేకోడూరు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ


రైల్వేకోడూరు రూరల్‌, జనవరి 28: రాయచోటి వద్దు...రాజంపేట ముద్దు నినాదంతో శుక్రవారం రైల్వేకోడూరు పట్టణం మార్మోగింది. రైల్వేకోడూరు జేఏసీ, అఖిలపక్షం నాయకులు, కోడూరు స్టూడెంట్‌ యూనియన్‌ ఫోర్స్‌, విద్యార్ధి సంఘాల నేతలు, విద్యార్ధులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టోల్‌గేట్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద మానవహరం నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహర దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఎటువంటి సౌకర్యాలు లేని రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం అన్యాయమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.


రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వినతి

ఒంటిమిట్ట, జనవరి 28 : రాజంపేట నుంచి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మండలంలోని టీడీపీ శ్రేణులు శుక్రవారం తహసీల్దారు శిరీషకు వినతిపత్రం అందజేశారు. మండలంలోని అన్ని పంచాయతీల నుండి టీడీపీ నాయకులు కోదండరామాలయం వెనుక భాగంలో చేరుకొని అక్కడి నుండి ర్యాలీగా అన్నమయ్య జిల్లాను రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని నినాదాలు చేస్తూ తహసీల్దారు కార్యాలయం చేరుకొని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:11:52+05:30 IST