పంట పండినా.. ఫలితం లేదు

ABN , First Publish Date - 2021-10-11T05:40:20+05:30 IST

మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నప్పటికి రైతులకు మాత్రం అంతం తమాత్రంగానే గిట్టుబాటు ధర లభిస్తున్నదని వాపోతు న్నారు.

పంట పండినా.. ఫలితం లేదు
అన్నవరప్పాడులో బెండకాయలు కోస్తున్న రైతు తోట భాస్కరరావు

 గిట్టుబాటు కాని ధరలు..

 రైతుల ఆవేదన 

పెరవలి, అక్టోబరు 10: మార్కెట్‌లో  కూరగాయల ధరలు మండిపోతున్నప్పటికి రైతులకు మాత్రం అంతం తమాత్రంగానే గిట్టుబాటు ధర లభిస్తున్నదని వాపోతు న్నారు. పెరవలి, నల్లాకులవారిపాలెం, కాకరపర్రు, ముక్కా మల గ్రామాల పరిధిలో సుమారు 700 ఎకరాల్లో కూరగా యల పంటలు సాగు చేస్తుంటారు. దీనికోసం వేలాది రూపా యలు పెట్టుబడులు పెట్టినప్పటికి తమకు దిగుబడులు ఉన్నప్పుడు రేటు  లేకపోవడం, రేటు ఉన్నప్పుడు  దిగుబడి లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదని వాపో తున్నారు. పురుగు మందులు రేట్లు విపరీతంగా పెరిగిపోయా యని వాపోతున్నారు. ఈ ప్రాం తంలో దొండ, బెండ, చిక్కుడు, కాకర, టమాటా, బీర, కాకర, పొట్ల, వంకాయ, ఆనప, దోస వంటి పంటలు ఆకు కూరలు వంటివి వేస్తుంటారు. ఈ పండిన పంటలను చుట్టుపక్కల సిద్దాంతం, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాలతోపాటు విజయవాడ, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే మార్కెట్‌ ధరలు తమకు దక్కకుండా దళారీలు అడ్డుకుంటున్నారని తమకు నామమాత్రపు ధరలు మాత్రమే దక్కుతున్నా యని రైతులు వాపోతున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న ధరలకు, రైతుల కుదక్కుతున్న ధరలకు పొంతన లేకుండా ఉంది. దీనికి తోడు తరచూ వర్షాలు రావడంతో పంటలు ఊటబారి పాడవుతున్నాయని, దిగుబడి తగ్గుతున్నదని  వాపోతు న్నారు. కాపుకు వచ్చి న అనంతరం ఊట బారిన పడితే సగానికి పైగా దిగుబడి తగ్గిపోవడంతో పాటు మొక్క లు కూడా చనిపోతాయని, దీంతో మరో రెండు నెలలు ఆగితే తప్ప కొత్తగా పంట చేతికి అందదని చెబుతున్నారు. 


కమీషన్‌ మార్కెట్‌ ధరలు

చిక్కుడు పది కేజీలు రూ.800 నుంచి 900, బెండకాయలు రూ.250 నుంచి 300, బీరా రూ. 300 నుంచి 400, దొండ రూ. 200 నుంచి 300, దోస రూ. 200 నుంచి 250, పచ్చిమిర్చి రూ. 150 నుంచి 200, వంకాయలు రూ.500నుంచి 600, కాకర రూ.200 నుంచి 250, పొట్ల కాయ ఒకటి రూ.10 నుంచి 15, ఆనబ రూ.10 నుంచి 25గా విక్రయిస్తున్నారు.


Updated Date - 2021-10-11T05:40:20+05:30 IST