సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్‌కు సుప్రీం నో

ABN , First Publish Date - 2020-11-28T07:56:12+05:30 IST

సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో అడ్మిషన్లలో సర్వీసులో ఉన్న డాక్టర్లకు రిజర్వేషన్‌ కల్పించడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సగం సీట్లను ఇన్‌-సర్వీ్‌స డాక్టర్లకు రిజర్వ్‌ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ప్రతిభగల

సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్‌కు సుప్రీం నో

న్యూఢిల్లీ, నవంబరు 27: సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో అడ్మిషన్లలో సర్వీసులో ఉన్న డాక్టర్లకు రిజర్వేషన్‌ కల్పించడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సగం సీట్లను ఇన్‌-సర్వీ్‌స డాక్టర్లకు రిజర్వ్‌ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు ప్రతిభగల విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని, దీన్ని కొట్టేస్తున్నామని జస్టిస్‌ లావు నాగేశ్వరరావుతో కూడిన బెంచ్‌ పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేరళ, మరికొన్ని రాష్ట్రాలు జారీచేసిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించిన బెంచ్‌- ఇది అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని తెలిపింది. అడ్మిషన్లు ఈ ఏడాది ఆగస్టు 3నే మొదలయ్యాయి. ప్రస్తుతం చివరిదశలో ఉన్నందున ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే వీటిని అమలుపర్చాలని బెంచ్‌ ఆదేశించింది. 

Updated Date - 2020-11-28T07:56:12+05:30 IST