ఉత్తర భారతదేశంలో చలిగాలుల ఉద్ధృతి

ABN , First Publish Date - 2021-01-20T20:30:42+05:30 IST

ఉత్తర భారతదేశంలో చలిగాలులు వీచడంతోపాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంది....

ఉత్తర భారతదేశంలో చలిగాలుల ఉద్ధృతి

పొగమంచుతో ఆలస్యంగా రైళ్ల రాకపోకలు

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో చలిగాలులు వీచడంతోపాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్మింది. చలిగాలుల ప్రభావంతో ప్రజలు వణుకుతున్నారు.ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశంలో ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గింది. దట్టమైన పొగమంచు కారణంగా బుధవారం 13 రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగిందని నార్తరన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చెప్పారు.ఢిల్లీలో చలిగాలుల ప్రభావం వల్ల గాలిలో నాణ్యత దెబ్బతింది. ఈ నెల 22వతేదీ వరకు ఉత్తర భారతావనిని చలిగాలులు వణికిస్తాయని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-01-20T20:30:42+05:30 IST