Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరి వద్దు.. ఆరుతడే ముద్దు

మునగాల మండలం మొద్దులచెర్వు గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌

జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌

మునగాల రూరల్‌, డిసెంబరు 8: వరికి ప్రత్యామ్నాయంగా రైతులు ఆరు తడి పంటలు సాగుచేయాలని జిల్లా వ్యవసాయాధికారి రామారావునాయక్‌ అన్నారు. మునగాల మండలం విజయరాఘవపురం, మొద్దులచెర్వు గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరుతడి పంటలపై రైతులకు ఆయన అవగాహన కల్పించి మాట్లాడారు. నూనెగింజలు, పప్పు దినుసుల పంటలు సాగు చేస్తే లాభాలు అధికంగా ఉంటాయన్నారు.  రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులను కొను గోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. రేపాల గ్రామంలో  పల్లి అమృతారెడ్డి సాగు చేస్తున్న కంది పైరును ఆయన పరిశీ లించారు. కాత సరిగా కానందున విత్తనం సరఫరా చేసిన కంపెనీ ప్రతి నిధులతో మాట్లాడి రైతుకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ అనిల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 

ఆరుతడి పంటలు సాగు చేయాలి: ఏఈవో

గరిడేపల్లి రూరల్‌: వరికి బదులుగా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఏఈవో నాగేంద్రబాబు కోరారు. పంట మార్పిడిపై మండలంలోని కీతవారిగూడెంలో రైతు లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. కార్యక్రమంలో  చాంద్‌మియా,  సైదయ్య, పిడమర్తి అంజి, చిత్తలూరి వెంకటేశ్వర్లు, కీత నర్సింహారావు, వెంకయ్య, శ్రీను, పిచ్చయ్య, నాగయ్య, శోభన్‌, రాంబాబు, వీరాంజి, యాద గిరి తదితరులు పాల్గొన్నారు.

తిరుమలగిరి: రైతులు యాసంగిలో వరిని సాగు చేయొ ద్దని ఏవో వెంకటేశ్వర్లు సూచించారు. తిరుమలగిరిలోని ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రంలో  రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మంలో తహసీల్దార్‌ సంతోష్‌ కిరణ్‌, ఏఈవో వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

వరిసాగు చేస్తే రైతులదే బాధ్యత: ఏవో

మఠంపల్లి: యాసంగిలో వరిసాగు చేస్తే ధాన్యాన్ని విక్రయించే బాధ్యత రైతులదేనని ఏవో బుంగారాజు అన్నారు. ఆరుతడి పంటలు సాగుచేయాలని మండలంలోని భీమ్లాతండా, పెదవీడు, మంచ్యాతండా, వర్ధపురం గ్రామాల్లో రైతులకు బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు భవన్‌, శ్రావ్య, ఝాన్సీ, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

నడిగూడెం: యాసంగిలో వరి కాకుండా ఇతర పంటలే సాగు చేయాలని  ఏవో రాజగోపాల్‌రావు అన్నారు. మండలంలోని నారాయణపురం, ఈకేపేట, చాకిరాల, వెంకట్రాంపురం తదితర గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రైతు సదస్సుల్లో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏఈవోలు పిచ్చయ్య, వినోద్‌, మౌనిక, రేష్మ, సర్పంచులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

అర్వపల్లి: రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని తుంగతుర్తి ఏడీఏ జగ్గునాయక్‌ అన్నారు.  మండల పరిధిలోని పర్సాయపెల్లి, బొల్లంపెల్లి గ్రామాల్లో రైతులకు ఆరుతడి పంటలపై వ్యవసాయ అధికారులు బుధ వారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.  రబీ సీజన్‌లో రైతులు వరిని సాగు చేయొద్దన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో దినకరణ్‌, ఏఈవో శోభారాణి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు. 
Advertisement
Advertisement