ఒనుకొండ వాసులకు రహదారి కష్టాలు

ABN , First Publish Date - 2021-06-24T05:33:30+05:30 IST

ఒనుకొండ వాసులకు రహదారి కష్టాలు

ఒనుకొండ వాసులకు రహదారి కష్టాలు
మహిళను డోలీ మోతతో ఆస్పత్రికి తీసుకెళుతున్న ఒనుకొండ వాసులు

అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలంటే డోలీ మోతే శరణ్యం


అనంతగిరి, జూన్‌ 23: మండలంలోని లుంగపర్తి పంచాయతీ ఒనుకొండ గ్రామానికి కనీస రహదారి సదుపాయం లేకపోవడంతో గిరిజనులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పురుటి నొప్పులు వచ్చిన గర్భిణులు, తీవ్రఅనారోగ్యానికి గురైన వారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీలో మోసుకెళ్లాల్సి వస్తున్నది. గ్రామానికి చెందిన సూకురు సోములమ్మ అనే మహిళ బుధవారం తీవ్రఅనారోగ్యానికి గురవ్వడంతో డోలీ కట్టి, సుమారు ఏడు కిలోమీటర్లు కొండకోనల్లో నడుచుకుంటూ ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు. వర్షాకాలంలో గెడ్డలు పొంగిప్రవహిస్తుండడంతో డోలీలో మోసుకెళ్లడానికి కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. 


Updated Date - 2021-06-24T05:33:30+05:30 IST