‘నో’... చెప్పండిలా!

ABN , First Publish Date - 2022-01-10T06:04:41+05:30 IST

నచ్చనిది నచ్చలేదని చెప్పడానికి కొందరికి

‘నో’... చెప్పండిలా!

నచ్చనిది నచ్చలేదని చెప్పడానికి కొందరికి మొహమాటం అడ్డొస్తుంది. ఎదుటి వాళ్లకు నచ్చకుండాపోతామేమోననే భయం కూడా కొందర్లో ఉంటుంది. దాంతో ‘నో’ చెప్పడానికి తటపటాయిస్తూ ఉంటారు. కానీ ఈ స్వభావంతో ఇబ్బందులు పడేకంటే, ఖరాఖండిగా ‘నో’ చెప్పడం ఇలా నేర్చుకోవాలి. 


 ఐడియా బాగుంది. కానీ నేను అందుబాటులో ఉండకపోవచ్చు అని చెప్పవచ్చు.

 నన్ను అడగాలని మీకు అనిపించినందుకు సంతోషం. కానీ నేనా పని చేయలేను. 

 ఐయామ్‌ సారీ, నేనిప్పుడు అంత సహాయం చేసే పరిస్థితిలో లేను.

 ప్రస్తుతానికి పరిస్థితి అనుకూలంగా లేదు. మరోసారి ఆలోచిద్దాం!

 నన్నే అడగాలని మీకు అనిపించినందుకు సంతోషం. కానీ ఇప్పుడు నేనందుకు 

సిద్ధంగా లేను.

 నేనిప్పుడు అందుబాటులో లేను. మరోసారి చూద్దాం!

 నో థ్యాంక్స్‌!


Updated Date - 2022-01-10T06:04:41+05:30 IST