Abn logo
Jun 15 2021 @ 01:03AM

జిల్లాలో దాతలకు కొదవలేదు : సీపీఐ రామకృష్ణ

కొవిడ్‌కేర్‌ సెంటర్‌కు సరుకులుఅందజేస్తున్న భవానీ రవికుమార్‌ మిత్రబృందం

అనంతపురం క్లాక్‌టవర్‌, జూన 14 : కరువు జిల్లాలో దాతృత్వానికి కొదవలే దని, ఇందుకు దాతల సహకారంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించడమే నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్‌ పేర్కొన్నారు. సీపీఐ ఆధ్వ ర్యంలో స్థానిక హెచ్చెల్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వీకే ఆదినారాయణరెడ్డి కొవిడ్‌కేర్‌ సెంటర్‌కు భవానీ రవికుమార్‌ మిత్రబృందం సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్‌లకు బియ్యం, గుడ్లు, వంటనూనె, బ్రెడ్డు అందజే శారు.  సీపీఐ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించటం అభినందనీయమని భవానీ రవి కుమార్‌ కొనియాడారు. కార్యక్రమంలో గల్లా హర్ష, వెంకటేశ్వర్లు, సుంకర ఫణికుమార్‌, రాయల్‌మురళీ, సంపత, జైకృష్ణ, చలపతి, హుస్సేన, పర్పుల్‌సింగ్‌, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.