జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదు : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2022-01-20T06:14:33+05:30 IST

జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదని డీఎంహెచ్‌వో కోటా చలం అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదు : డీఎంహెచ్‌వో
సమావేశంలో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో కోటా చలం

మునగాల, జనవరి 19 : జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేదని డీఎంహెచ్‌వో కోటా చలం అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం, జలుబు లక్షణాలు ఉన్న వారు కొవిడ్‌ టెస్టులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకోవాలని; పాజిటివ్‌గా వస్తే హోంక్వారంటైన్‌గా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా, కొవిడ్‌ నిబంధనలు పాటించేలా వైద్యసిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 17 ఏళ్లు నిండిన వారికి 46 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని తెలిపారు. వైద్య, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి మునగాల మండలాన్ని వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసి ముందుంచాలని అన్నారు. సమావేశంలో వైద్యాధికారులు యాదా రమేష్‌, పాపిరెడ్డి, హెచ్‌ఈవో షాబుద్దీన్‌, అంజయ్య, ఏఎన్‌ఎంలు వైద్యసిబ్బంది, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:14:33+05:30 IST