Advertisement
Advertisement
Abn logo
Advertisement

చక్కెర లేదు

బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా చేయని టెండర్‌దారుడు

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 2: జిల్లాలో రేషన్‌ షాపుల్లో చక్కెర సరఫరా నిలిచిపోయింది. బియ్యం, కందిపప్పుతోపాటు కార్డుదారులకు అర కిలో చక్కెరను  ఇవ్వాల్సి ఉంది. అయితే డిసెంబరులో పంపిణీ చేస్తున్న రేషన్‌ సరుకుల్లో చక్కెర లేకుండా బియ్యం, కందిపప్పు మాత్రమే అందజేస్తున్నారు. అందిన సమాచారం మేరకు జిల్లాలో పౌరసరఫరాల గౌడన్ల నుంచే రేషన్‌ షాపులకు చెక్కర సరఫరా చేయలేదని సమాచారం. గతనెలలో మిగిలి ఉన్న చక్కెరను కొన్ని ప్రాంతాలకు సరఫరా చేయగా, మిగిలిన ప్రాంతాలకు సరఫరా లేకపోవడంతో పంచదార పంపిణీని నిలిపివేశారు. జిల్లాలో ప్రతినెల చక్కెర 150టన్నుల వరకు కావాలి. అయితే అందుకు సంబంధించి టెండర్లు కూడా వేశారు. టెండర్‌ వేసిన వ్యక్తి ప్రతినెల పౌరసరఫరాల శాఖ గిడ్డంకులకు చక్కెరను సరఫరా చేస్తాడు. అయితే టెండర్‌ దారుడికి రూ.15కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఆ డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరాను నిలిపివేసినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై పౌరసరఫరాల శాఖ అధికారులు టెండర్‌దారుడితో మాట్లాడినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి త్వరగా బకాయిలు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గురువారం కొన్ని ప్రాంతాలకు చక్కెర సరఫరా చేసినట్లు తెలుస్తోంది. 


Advertisement
Advertisement