Abn logo
May 27 2020 @ 19:54PM

బన్నీ ‘పుష్ప’లో నో సుమ

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాపై విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. అందులోనూ పాన్ ఇండియా మూవీ కావడంతో బన్నీ కూడా ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ప్రమోషన్ విషయంలో అస్సలు ఎక్కడా తగ్గడం లేదు కూడా. ఇక ఈ సినిమా లుక్‌లంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ చాలానే వచ్చాయి. సినిమాకి చాలా దగ్గరగా ఉండేలా ఆ పోస్టర్స్ ఉండటం విశేషం. ప్యాన్ మేడ్ పోస్టర్స్ లాగే ఈ సినిమాలో నటించే వారి గురించి కూడా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో యాంకర్ సుమ అల్లు అర్జున్‌కు అక్కగా నటించబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వార్త నిజమేనా? కాదా? అనే దానిపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.


అయితే ఈ చిత్రంలో సుమ నటించడం లేదంటూ చిత్ర వర్గాలు తెలిపినట్లుగా తాజాగా ఓ వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో నటించడానికి సుమను సంప్రదించడం కానీ, అలాగే సుమకు పాత్ర ఉందనేది కానీ నిజం కాదని వారు తెలుపుతున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులందరినీ సుకుమార్ ఎప్పుడో సెలక్ట్ చేశారని, లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ మొదలవుతుందని చిత్రవర్గాలు తెలిపినట్లుగా సమాచారం.

Advertisement
Advertisement
Advertisement