మా కాలనీలో వైన్‌ షాపులు వద్దు

ABN , First Publish Date - 2021-12-06T04:34:16+05:30 IST

కల్వకుర్తి పట్టణంలోని గాంధీ నగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన రెండు వైన్‌ షాపులను అక్కడి నుంచి తొలగించాలని కాలనీ వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది.

మా కాలనీలో వైన్‌ షాపులు వద్దు
నిరసన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు

కల్వకుర్తి, డిసెంబరు 5: కల్వకుర్తి పట్టణంలోని గాంధీ నగర్‌ కాలనీలో ఏర్పాటు చేసిన రెండు వైన్‌ షాపులను అక్కడి నుంచి తొలగించాలని కాలనీ వాసులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. అధికారులు స్పందించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని మహిళలు చీపురు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ మంజుల, మాజీ కౌన్సిలర్‌ యాదగిరి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మధు, నాయకులు సత్తార్‌, ముక్కరం ఖాన్‌, నాని, ఆయూబ్‌ ఖాన్‌, చంద్ర శేఖర్‌, నాయకురాలు లక్ష్మి, రేష్మ, రెహన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T04:34:16+05:30 IST