Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ అపార్ట్‌మెంట్స్‌ను ఎవరూ కొనొద్దు: అపార్ట్‌మెంట్స్ వాసులు

విశాఖపట్నం: యదువంశీ కన్‌స్ట్ర‌క్షన్స్ అధినేత రామయ్య కట్టే అపార్ట్‌మెంట్స్ ఎవరూ కొనొద్దని ఆయన కట్టిన అపార్ట్‌మెంట్స్‌లలో నివాసముంటున్న వాసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని విశాఖ 96వ వార్డులోగల యదువంశీ ఆయతనం అపార్ట్‌మెంట్ వాసులు నిరసన వ్యక్తం చేశారు. 250 కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయన్నారు. వీరికి నీళ్లు గాని, సరైన సౌకర్యాలు గాని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. యదువంశీ కన్‌స్ట్ర‌క్షన్స్ అధినేత రామయ్య  మాయమాటలు చెప్పి సుమారు 250 మందికి ఫ్లాట్ల అమ్మకాలు చేశారని వారు ఆరోపించారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేని దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆయన కట్టే  అపార్ట్‌మెంట్స్ ఎవరూ కొనొద్దని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. Advertisement
Advertisement