ఏపీ ఇచ్చిన ఎన్‌వోసీని తిరస్కరించిన తెలంగాణ.. విద్యార్థుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-03-26T22:01:42+05:30 IST

కర్నూలు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏపీ ఇచ్చిన ఎన్‌వోసీని తిరస్కరించిన తెలంగాణ.. విద్యార్థుల ఇక్కట్లు

కర్నూలు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి పోలీసులు ఎవ్వరికీ అనుమతి ఇవ్వట్లేదు. కాగా.. కర్నూలు జిల్లా నంద్యాల గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్‌లో కొందరు తెలంగాణ విద్యార్థులు బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు. కరోనా కారణంగా కోచింగ్ సెంటర్‌కు సెలవులు ఇవ్వడంతో నిన్న తెలంగాణకు వెళ్లేందుకు ఏపీ పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఆ ఎన్‌వోసీని తెలంగాణ పోలీసులు నిరాకరించారు. దీంతో తినడానికి ఆహారం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


Updated Date - 2020-03-26T22:01:42+05:30 IST