`బిగ్బాస్-4` టాప్ ఫైవ్ జాబితాలో గాయకుడు నోయల్ తప్పకుండా ఉంటాడని అంచనాలు వినిపించాయి. అయితే అనారోగ్యం కారణంగా నోయల్ షో మధ్యలోనే బయటకు వచ్చేశాడు. మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తాడని అనుకున్నప్పటికీ కుదరలేదు. దీంతో తన స్నేహితులైన అభిజిత్, హారికకు సపోర్ట్ చేస్తున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నోయల్ `బిగ్బాస్` గురించి సంచలన కామెంట్స్ చేశాడు. ``బిగ్బాస్` కార్యక్రమానికి ఎందుకు వెళ్లానో అర్థం కావడం లేదు. `బిగ్బాస్` కార్యక్రమం మనకు అవసరం లేదని అర్థమైంది. షో కూడా చూడడం మానేశాను. హౌస్లో అందరూ మంచివాళ్లే. నేను మాత్రం అభిజిత్, హారికకు మద్దతుగా నిలుస్తాన`ని చెప్పాడు.