నోయిడా మెట్రో సంచలన నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి గౌరవంగా..

ABN , First Publish Date - 2020-10-28T02:04:18+05:30 IST

నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్‌సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ (లింగమార్పిడి సమాజానికి) గౌరవ సూచకంగా సెక్టార్ 50 స్టేషన్

నోయిడా మెట్రో సంచలన నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి గౌరవంగా..

న్యూఢిల్లీ: నోయిడా మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్‌సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ (లింగమార్పిడి సమాజానికి) గౌరవ సూచకంగా సెక్టార్ 50 స్టేషన్‌ పేరును ‘ప్రైడ్ స్టేషన్’గా మార్చింది. ఓ స్టేషన్‌ను ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి అంకితం చేసిన ఉత్తర భారతదేశంలోని తొలి మెట్రో రైల్ సర్వీస్‌గా ఎన్ఎంఆర్‌సీ రికార్డులకెక్కింది. 


2017లో కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 23 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలిచ్చి సంచలనం సృష్టించింది.  ఇక, నోయిడాలోని ‘ప్రైడ్ స్టేషన్’లో ఆరుగురు ట్రాన్స్‌జెండర్లను ఉద్యోగులుగా నియమించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉండగా, వారిలో 35 వేల మంది ఎన్‌సీఆర్ పరిధిలో నివసిస్తున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య మరింత పెరిగి ఉంటుందని ఎన్‌ఎంఆర్‌సీ పేర్కొంది. 

Updated Date - 2020-10-28T02:04:18+05:30 IST