Abn logo
May 27 2020 @ 07:45AM

నోకియాలో 42 మందికి కరోనా..శ్రీపెరంబుదూర్ ప్లాంట్ మూసివేత

చెన్నై (తమిళనాడు): కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సమీపంలోని శ్రీ పెరంబుదూర్ ప్రాంతంలో ఉన్న నోకియా ప్లాంటును మూసివేశారు. నోకియా సెల్ ఫోన్ల తయారీ కంపెనీలో 42 మంది కార్మికులకు కరోనా వైరస్ సోకింది. కరోనా ప్రబలకుండా నోకియా ప్లాంటును మూసివేసిన యాజమాన్యం త్వరలో కంపెనీలో కార్మికులు భౌతికదూరం పాటిస్తూ తక్కువ మంది పనిచేసేలా మార్పులు తీసుకువస్తామని ప్రకటించింది. చైనా దేశానికి చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన ఒప్పోకు  న్యూఢిల్లీ శివార్లలో ఉన్న ప్లాంటును గత వారం మూసివేశారు. ఒప్పో కంపెనీలో 9 మంది కార్మికులకు కరోనా సోకింది. నోకియా, ఒప్పో ప్లాంట్ల మూసివేతతో మొబైల్ ఫోన్ల తయారీకి బ్రేకు పడింది. 

Advertisement
Advertisement
Advertisement