నామమాత్రంగా ఎక్సైజ్‌

ABN , First Publish Date - 2020-06-04T11:10:42+05:30 IST

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ నామమాత్రంగా మారిపోయింది. ఇప్పుడు కేవలం అమ్మ కాలకే పరిమితమైంది.

నామమాత్రంగా ఎక్సైజ్‌

30 శాతం సిబ్బందితో సరి

అమ్మకాలకే పరిమితం

70 శాతం మంది 

సెబ్‌ పరిధిలోకి..

ఉప కమిషనర్‌ 

పోస్టుపై మీమాంస

57 షాపులు తగ్గింపు


ఏలూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ నామమాత్రంగా మారిపోయింది. ఇప్పుడు కేవలం అమ్మ కాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో 30 శాతం మందిని మాత్రమే ఆ శాఖలో కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఉన్న డిపోలు, షాపుల నిర్వహణ బాధ్యతలకే వారు పరిమితమయ్యారు. పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించే నేర నియంత్రణ విభాగమంతా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (సెబ్‌) పరిధిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో 70 శాతం మంది ఈ శాఖ పరిధిలోకి వెళ్లారు. జిల్లాలో ప్రస్తుతం 365 పోస్టులు ఉండగా 282 మంది సిబ్బంది ఉన్నారు. మిగిలిన 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 254 పోస్టులను సెబ్‌కు కేటాయించగా ప్రస్తుతం విధుల్లో ఉన్న 197 మంది ఆ శాఖ పరిధిలోకి వెళ్లిపోయారు. 57 పోస్టుల్లో నియామకాలు జర గాల్సి ఉంది. ఎక్సైజ్‌ శాఖకు 111 పోస్టులను కేటాయించగా 85 మంది బాధ్యతలు చేపట్టారు.


26 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. ఎక్సైజ్‌ ఉప కమిషనర్‌ ఇటీవలే పదోన్నతిపై రాష్ట్ర కమిషనరేట్‌లో జాయింట్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు.సెబ్‌కు జిల్లా స్థాయి అధికారి హోదాలో అదనపు ఎస్పీగా ఐపీఎస్‌ కేడర్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో అందుకు భిన్నంగా నాన్‌ ఐపీఎస్‌ అధికారిని ఏఎస్పీగా నియ మించారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖలో బాధ్యతలు నిర్వహి స్తున్న సురేశ్‌బాబును సెబ్‌ ఉన్న తాధికారిగా నియమించారు. ఏసీబీ శాఖ ఆయనని ఇంకా రిలీవ్‌ చేయకపోవడంతో ఆయన ఇంకా సెబ్‌ బాధ్యతలు చేపట్టలేదు. ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖలో ఉప కమిషనర్‌ పోస్టు ఉంటుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. 


జిల్లాలో 57 షాపుల మూసివేత

దశలవారీ మద్య నిషేధం అమలులో భాగంగా జిల్లాలోని మూడు డిపోల పరిధిలో 57 రిటైల్‌ షాపులను అధికారులు మూసేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో 20 శాతం షాపులను మూసేస్తామని చెప్పింది. ఆ ప్రకారం చూస్తే 75 షాపులు మూసే యాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. ఏలూరు డిపో పరిధిలో ప్రస్తుతం ఉన్న 121 షాపుల్లో 20 షాపులు, భీమవరం స్టేషన్‌ పరిధిలోని 128 షాపుల్లో 19 షాపులు, చాగల్లు పరిధిలోని 126 షాపుల్లో 18 షాపులు మూసేశారు.దీంతో జిల్లాలో 375 షాపులకుగాను 318 షాపులు మాత్రమే తెరుస్తున్నారు. 

Updated Date - 2020-06-04T11:10:42+05:30 IST