Abn logo
Jun 30 2020 @ 11:41AM

ఇప్పట్లో లేనట్టే..!

ఊసేలేని నామినేటెడ్‌ పదవులు

కరోనా ప్రభావంతో మరికొంత   సమయం పట్టే అవకాశం

ఆశగా ఎదురుచూస్తున్న నేతలు


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా పరిధిలో నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూస్తున్న అధికార పార్టీ నేతలకు మరికొంత కాలం వేచి చూసే పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, కరోనా కట్టడి తర్వాతే పదవులపై అధిష్ఠానం దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో ఖాళీగా ఉన్నవి భర్తీచేసే అవకాశం ఉన్న రాష్ట్రస్థాయి పదవులు మాత్రం ఇప్పుడు భర్తీచేసే అవకాశాలు లేనట్లు పార్టీ వర్గాలను  బట్టి తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు రాష్ట్రస్థాయి పదవుల కోసం వేచి చూస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో తమకు అవకాశం వస్తోందని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మొదటి నుంచి పదవులు బాగానే వస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది నియోజకవర్గాలుండగా మొత్తం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే గెలుపొందారు. వీరిలో స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియమితులు కాగా మంత్రిగా ప్రశాంత్‌రెడ్డికి అవ కాశం ఇచ్చారు. విప్‌గా గంప గోవర్ధన్‌కు అవ కాశం ఇచ్చారు. 


మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలకు రాష్ట్ర శాసనసభ కమిటీలలో అవకాశం క ల్పించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో కొత్తగా మార గంగారెడ్డికి మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. గతంలోనే తిరుమల్‌రెడ్డికి ఆ హార కమిషన్‌ చైర్మన్‌గా, శ్రీధర్‌కు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకావం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మార్కెట్‌లు, సొసైటీలలో ఇ తరులకు అవకాశం కల్పించారు. ఖాళీగా ఉన్న మార్కెట్‌ కమిటీలు భర్తీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని రాష్ట్రంలోనే పేరు గాంచిన నిజామాబాద్‌  వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, ఆర్మూర్‌, బీర్కూర్‌, ఎల్లారెడ్డి కమిటీలు ఖాళీగా ఉన్నాయి. ఈ మద్యనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్‌ ఎత్తివేయగానే వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మార్కెట్‌ కమిటీల పాలకవర్గాలను నియమించారు. బాన్సువాడ వ్యవసాయ కమిటీ పాలకవర్గం ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్న ట్లు తెలుస్తోంది. 


ఏడాదిన్నరగా ఎదురుచూపు..

నిజామాబాద్‌ వ్యవసాయ పాలకవర్గం ఏ డాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో ఎక్కువ మంది నేతలు ఆశిస్తున్నారు. ఆదాయం ఎక్కువగా ఉండడంతో పాటు పేరు కూడా వ చ్చే అవకాశం ఉండడంతో చాలా మంది అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా ఎన్నికలు రావడం వల్ల జిల్లా నేతలు కూడా ఈ పాలకవర్గంపై దృష్టి పెట్టలేదు. ఇతర వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు కూడా ఈ మధ్యనే కొద్దిగా కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పదవి మాత్రం భర్తీ కావడం లేదు. పక్కనే ఉన్న జిల్లాల పదవులు భర్తీ చేసినా జిల్లాలోని ఈ సంస్థకు మాత్రం భర్తీ చేయ డంలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలోని సీనియర్‌ నేతలు మాత్రం రాష్ట్రస్థాయి పదవులను ఆశి స్తున్నారు. రాష్ట్ర కార్పొరేషన్‌లలో చోటు కోసం  ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి అయిదున్నర ఏళ్లు గడుస్తున్నా కొంత మందికి పదవులు రాకపోవడంతో గట్టి ప్రయత్నాలు చేస్తు న్నారు.


స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తర్వాత కొంత మంది నేతలకు అవకాశం వ స్తుందని భావించినా కరోనా ఎఫెక్ట్‌తో ఉప ఎన్నిక వాయిదా పడడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య నే ఉప ఎన్నికల కోడ్‌ సడలించడంతో కొంత మంది నేతలు ప్రయత్నాలు చేసినా ఇప్పట్లో లేనట్లు సీనియర్‌  నేతల నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.  కరోనా ఎఫెక్ట్‌ తగ్గి, ఉప ఎన్నిక పూర్తయిన తర్వాతే పదవుల భర్తీ ఉంటుందని తెలిపినట్లు తెలుస్తోంది. ఏదైనా సమయం అనుకూలిస్తే ఈలోపు ఖాళీగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలకవర్గం పోస్టులు భర్తీ చేసే అవ కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఉ మ్మడి జిల్లా పరిధిలోని సీనియర్‌ నేతలు వేచి చూడాల్సిందే. 


Advertisement
Advertisement