ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు

ABN , First Publish Date - 2021-01-10T08:16:05+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లు తీసుకోవాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. బెదిరింపులు, దౌర్జన్యాలతో నామినేషన్లు వేయకుండా అడ్డుకొనే వ్యవహారాల కు అడ్డుకట్ట వేసేందుకుఈ విధానం

ఆన్‌లైన్‌లోనూ నామినేషన్లు

దౌర్జన్యాలను అడ్డుకొనేందుకు ఈ విధానం తేవాలి

దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే వైసీపీకి ఎందుకు బాధ?

నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌


‘రాష్ట్రంలో ఏం జరిగినా జగన్‌ టీడీపీపై దుష్ప్రచారం చేసి బయటపడాలని చూస్తాడు. కోర్టులు తీర్పులిచ్చినా, ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు పెట్టినా, దాడులు, దౌర్జన్యాలు జరిగినా, ఆలయాలపై దాడులు జరిగినా అన్నింటికీ టీడీపీని నిందించి తన చేతగానితనం బయటకు రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు’  ‘జగన్‌ కేసులో నిందితురాలి గా ఉన్న శ్రీలక్ష్మిని తెలంగాణ క్యాడర్‌ నుంచి తెచ్చుకొని ఏపీలో నియమించారు. తన కేసుల్లో ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను సీఎస్‌ని చేశారు. ఇంకో నిందితుడిని కలెక్టర్‌గా చేశారు. వీళ్లందరి తో తనకు.. తన పార్టీకి పని చేయించుకొంటూ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు.     

- చంద్రబాబు


అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్లు తీసుకోవాలని టీడీపీ డిమాండ్‌ చేసింది. బెదిరింపులు, దౌర్జన్యాలతో నామినేషన్లు వేయకుండా అడ్డుకొనే వ్యవహారాల కు అడ్డుకట్ట వేసేందుకుఈ విధానం తేవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అన్ని నియోజకవర్గాల టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని, గ్రామ వలంటీర్లకు ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించొద్దని, గతం లో ఎన్నికల కమిషన్‌ సిఫార్సు చేసిన అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని, ప్రభుత్వ భవనాలపై వైసీపీ రంగులు తొలగించాలని, గతం లో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేసి.. అన్ని స్థానాలకు మళ్లీ కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.


పంచాయతీ ఎన్నికల్లో పాఠం చెప్పాలి

19 నెలల పాలనలో వైసీపీ చేసిన పాపాలకు పంచాయతీ ఎన్నికల్లో ప్ర జలు పాఠం చెప్పాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ‘జేట్యాక్స్‌ వసూళ్ల కోసం మద్యం, ఇసుక, సిమెంటు ధరలు పెంచారు. కంపెనీలను తరిమేశారు. దీనివల్ల 32 లక్షల ఉద్యోగాలు యువతకు రాకుండా పోయాయి. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 8 లక్షల రేషన్‌ కార్డులు తొలగించారు. ఈ అక్రమాలు, వైఫల్యాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ‘పల్నాడు, నెల్లూరు, నంద్యాల, రాజమండ్రి ఘటనల్లో ముస్లింలకు అండగా నిలిచాం. దళితులపై దాడులు జరిగితే వారికి రక్షణగా నిలిచింది మేం. రాష్ట్రంలో 140 ఆలయాలపై దాడులు జరిగితే ఒక్కచోటకైనా ఈ ముఖ్యమంత్రి వెళ్లారా? కనీసం స్పందించారా? ఎన్నికల ముందు నదిలో మునకేసి హిందువునని భ్రమ కల్పించి మోసం చేశాడు. నేను ఎప్పుడూ ఇటువంటి నాటకాలు ఆడలేదు. నేను హిందువునని చెప్పడానికి భయపడలేదు. ఈ ముఖ్యమంత్రి తాను క్రైస్తవుడినని చెప్పుకోవడానికి భయమెందుకు? నెల్లూరు ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్‌ చనిపోతే ఆయన కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడు. చల్లా రామకృష్ణా రెడ్డి చనిపోతే తానే ఆయన ఇంటికి వె ళ్లి కుటుంబసభ్యులను పరామర్శించాడు. ఆయనను చూసి ఆ పార్టీ వాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు’ అని అన్నారు. 


మీ సంబరాలకు లేని కరోనా..: అచ్చెన్న

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను తమ పార్టీ స్వాగతిస్తోందని చెప్పారు. పట్టాల పండగలు, జగన్‌ పుట్టిన రోజుల సంబరాలకు అడ్డురాని కరోనా ఎన్నికలకు అడ్డు వస్తోందని ఎద్దేవా చేశారు. రైతులకు రూ. 2700 కోట్లు బకాయిలు చెల్లించాలని, డబ్బులు అందక రైతులు సంక్రాంతి పండగ కూడా జరుపుకొనే పరిస్ధితిలో లేరని టీడీఎల్పీ ఉప నేత రామానాయుడు అన్నారు. 


పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ జరపడానికి వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు బాధ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘పోలీసులను అడ్డుపెట్టుకొని గత మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ముఖ్యమం త్రి అక్రమాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు అలా చేయలేడు కాబట్టే ఎన్నికలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నాడు. ఎన్నికలు పె ట్టాలా.. వద్దా అనేది ఎన్నికల కమిషన్‌ అధికారం. ఈసీ అధికార పరిధిని ప్రశ్నించే అధికారం అధికారులకు, ఉద్యోగ సంఘా ల నేతలకు లేదు. పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎంకి ఏం సం బంధం? ఎన్నికల సంఘాన్ని నియంత్రించడానికి ముఖ్యమంత్రి ఎవరు? తన తాబేదారులతో ఎన్నికలకు వ్యతిరేకంగా ప్రకటన లు ఇప్పించడం ఏమిటి? కోడ్‌ కారణంగా ఎన్నికలు పూర్తయ్యే వరకూ సీఎం ఇంటికే పరిమితం కావాలి. వైసీపీ నాయకులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ దాడులు, దౌర్జన్యాలు జరిగినా అవసరమైతే నే నే వచ్చి నిలబడతాను. దాడులు, దౌర్జన్యాలను సహించేది లేదు. గ్రామాల్లో పో రాడుతున్న కార్యకర్తలకు పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు అండగా నిలవాలి. టీడీపీకి ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-01-10T08:16:05+05:30 IST