Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 29 2021 @ 19:55PM

రేపు ఉదయం 11 గంటలకు నోముల భగత్‌ నామినేషన్

నల్లగొండ: సోమవారం ఉదయం 11 గంటలకు నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్ నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరుకానున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. భగత్‌కు కేసీఆర్ బీ ఫామ్ ఇచ్చారు. అనంతరం భగత్ మీడియాతో మాట్లాడారు. ‘‘పార్టీలో చేరినప్పటి నుంచి మా నాన్నను. సీఎం కేసీఆర్‌ అక్కున చేర్చుకున్నారు. మా నాన్న ఆశయాలు నెరవేరుస్తాను. నోముల వారసుడిగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని భగత్‌ ప్రకటించారు.

Advertisement
Advertisement